Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెహ్వాగ్‌తో ఆడటం నా అదృష్టం: అభిమానినన్న మాక్స్‌వెల్

న్యూఢిల్లీ: తాను డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీరాభిమానినని ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ జట్టు తరపున ఆడుతున్న గ్లేన్ మాక్స్‌వెల్ తెలిపాడు. తనతో కలిసి ఐపిఎల్‌లో తన అదృష్టమని మాక్స్‌వెల్ పేర్కొన్నాడు. నిరుడు కూడా పంజాబ్ తరపున మాక్స్‌వెల్.. పరుగులతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఐపిఎల్ సీజన్లో కూడా పంజాబ్ తరపున ఆడుతూ తన విధ్వంసాన్ని కొనసాగించాలని అకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సమయంలో తాను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి చాలా మెళకువలు నేర్చుకున్నానని తెలిపాడు. ఇక్కడి ఆటగాళ్ల ఆటను గమనించానని తెలిపాడు.

Lucky to play alongside a legend like Sehwag, says Glenn Maxwell

ఆ తర్వాత తాను పంజాబ్ కింగ్స్ లెవన్ జట్టు తరపున ఆడుతున్నానని తెలిపాడు. ఇక్కడ మరో దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తోపాటు ఆడే అవకాశం లభించిందని చెప్పాడు. సచిన్, సెహ్వాగ్ లాంటి గొప్ప ఆటగాడితో ఆడటం తన అదృష్టమని తెలిపాడు. ప్రాక్టీస్ సందర్భంగా సెహ్వాగ్, తాను చర్చలు జరుపుతామని చెప్పాడు.

ఈ టోర్నీలో ఉత్తమంగా రాణిస్తాననే నమ్మకం తనకుందని తెలిపాడు. తన సామర్థ్యం మేరకు రాణించి జట్టు గెలుపునకు కృషి చేస్తానని చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లతో ఆడే అవకాశం రావడం గొప్ప అవకాశమని తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+