
హైదరాబాద్: చెన్నై జట్టుకు ఎంపికవడంతో అమితోత్సాహంతో ఉన్నాడు లుంగీ ఎంగిడి. బెంగుళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన వేలంలో లుంగీ ఎంగిడిని చెన్నై జట్టు కొనుగోలు చేసింది. సూపర్ కింగ్స్ జట్టు అతని ప్రారంభ ధర అయిన రూ. 50లక్షలకే సొంతం చేసుకుంది.
ఇప్పటికే దక్షిణాఫ్రికా అంతర్జాతీయ జట్టులో ఆడుతున్న ఎంగిడి మంచి ఫామ్ లో దూసుకెళ్తున్నాడు. భారత జట్టుతో సెంచూరియో వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆడిన ఎంగిడి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా వంటి ప్రధాన వికెట్లను సైతం తీయగలిగాడు.
'ఐపీఎల్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నా. అండర్ 19 జట్టులో దక్షిణాఫ్రికా జట్టులో ఆడటంతో నాకు భారత క్రికెటర్ల గురించి కొద్దిగా అవగాహన ఉంది. నాకు భారీ లక్ష్యాలేమీ లేవు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బలం నాకు నచ్చుతుంది.' అని ఎంగిడి పేర్కొన్నాడు.
అంతేకాదు బాలీవుడ్ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్ లోని లుంగీ డాన్స్ పాట అంటే తనకు చాలా ఇష్టమని దాని గురించి అడిగి మరీ తెలుసుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.