For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాలా భయపడ్డా: బంతి తలను తాకడంపై టర్నర్

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ వోజస్ హెల్మెట్‌కు తస్మానియా జట్టు బౌలర్ కామెరెన్ స్టీవెన్ సన్ వేసిన బంతి గట్టిగా తాకడంతో తాను కాసేపు నిశ్చేష్టుడిని అయిపోయానని తెలిపాడు.

By Nageshwara Rao

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ వోజస్ తలకు బంతి బలంగా తాకడంతో తాను ఆందోళనకు గురైనట్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్, సహచర క్రికెటర్ ఆస్టన్ టర్నర్ పేర్కొన్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా గురువారం మ్యాచ్‌లో ఆడమ్ వోజస్ తలకు బంతి తగలడంతో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

Lucky he stayed on his hands, knees and didn't collapse: Turner

ఈ ఘటనపై ఆస్టన్ టర్నర్ మీడియాతో మాట్లాడాడు. వోజస్ హెల్మెట్‌కు తస్మానియా జట్టు బౌలర్ కామెరెన్ స్టీవెన్ సన్ వేసిన బంతి గట్టిగా తాకడంతో తాను కాసేపు నిశ్చేష్టుడిని అయిపోయానని తెలిపాడు. బంతి తగిలిన వెంటనే వోజస్ మైదానంలో కుప్పకూలిపోయాడని పేర్కొన్నాడు.

'ఆ బంతి వోజస్ హెల్మెట్ వెనుక బాగాన తగిలిన మరుక్షణమే నాకు భయమేసింది. ఏమి చేయాలో అర్ధం కాలేదు. అవతలి వైపు ఉన్న నేను అలానే ఉండిపోయా. వోజస్ మోకాళ్లను, చేతులను భూమిపై పెట్టి కాసేపు బాధను ఓర్చుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఫీల్డ్‌లో కుప్పకూలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందనుకున్నా. ఆ తర్వాత మెడికల్ సిబ్బంది అక్కడికి వచ్చి అతనికి ప్రాథమిక చికిత్స చేయడంతో నేను కాస్త కుదుటపడ్డా' అని టర్నర్ తెలిపాడు.

తాను చూసిన ఆటగాళ్లలో వోజస్ చాలా కఠినమైన బ్యాట్స్‌మెన్ అని చెప్పుకొచ్చాడు. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో భాగంగా గురువారం తస్మానియా జట్టుతో ఆడుతున్న సమయంలో కామ్ స్టీవెన్ సన్ విసిరిన బంతి వెస్ట్రన్ ఆస్ట్రేలియా కెప్టెన్ వోజస్ తలను బలంగా తాకింది.

ఆస్ట్రేలియా జట్టు తరుపున వోజస్ 20 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. టెస్టుల్లో వోజస్ యావరేజి 61.87గా ఉంది. ఇదే తరహాలో వోజస్ గాయపడటం ఈ ఏడాది రెండోసారి. ఈ ఏడాది మొదట్లో మిడిల్‌సెక్స్‌లో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడుతూ వోజస్ గాయపడ్డాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+