న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Lucky Charm! కేదార్ జాదవ్ జట్టులో ఉంటే టీమిండియాకు విజయమే!

India Vs New Zealand : Virat Kohli And Co Unbeaten In The Last 16 ODIs With Kedar Jadav Playing
Lucky Charm! Virat Kohli and Co unbeaten in the last 16 ODIs with Kedar Jadhav in playing XI

హైదరాబాద్: ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ భారత వన్డే జట్టులో ఉంటే విజయమే! ఇది మాజీ క్రికెటర్లు, లేదా అభిమానులు అన్న మాటలు కాదు. గత రెండేళ్లుగా కేదార్ జాదవ్ జట్టులో ఉంటే టీమిండియా నమోదు చేసిన రికార్డుల ఆధారంగా వెల్లడైంది.

టీమిండియా దాడి చేస్తుంది: భారత క్రికెటర్లతో జాగ్రత్త!టీమిండియా దాడి చేస్తుంది: భారత క్రికెటర్లతో జాగ్రత్త!

టీమిండియా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేదార్ జాదవ్ బ్యాట్‌తో సెంచరీలు సాధించడం లేదు, అలా అని బంతితోనూ ఎక్కువ వికెట్లు తీసింది లేదు. అయితే అతడు తుది జట్టులో ఉంటే మాత్రం జట్టు ఎలా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడనేదేగా మీ అనుమానం.

1
44082
అక్టోబరు 25, 2017 నుంచి

అక్టోబరు 25, 2017 నుంచి

అక్టోబరు 25, 2017 నుంచి కేదార్ జాదవ్ 16 వన్డేల్లో ఆడితే భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోలేదు. గత ఏడాది ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌ని మాత్రమే డ్రాగా ముగించింది. న్యూజిలాండ్‌తో ఇటీవల నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కేదార్ జాదవ్ 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

22 పరుగులతో నాటౌట్‌గా

22 పరుగులతో నాటౌట్‌గా

ఆ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (75 నాటౌట్), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45) నిలకడగా ఆడటంతో156 పరుగుల లక్ష్యాన్ని భారత్ 34.5 ఓవర్లలోనే ఛేదించేసింది. దీంతో కేదార్ జాదవ్‌కి బ్యాటింగ్ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత మౌంట్ మాంగనూయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన జాదవ్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

6 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్

6 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్

ఈ మ్యాచ్‌లో జాదవ్ 6 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు. ఇలా ఈ రెండు వన్డేల్లోనూ అతను చేసిన ప్రదర్శన నామమాత్రమే. కానీ.. భారత్ జట్టు మాత్రం ఘన విజయాల్ని అందుకుంది. దీంతో కేదార్ జాదవ్‌ జట్టులో ఉంటే భారత్ తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది.

Story first published: Monday, January 28, 2019, 10:29 [IST]
Other articles published on Jan 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X