
మొదటి ఓవర్ నుంచే బాదుడే బాదుడు
మొదటి ఓవర్ నుంచే డికాక్ తన హిట్టింగ్ ప్రారంభించాడు. ఉమేష్ యాదవ్ వేసిన తొలి ఓవర్లో ఫోర్‌తో మొదలెట్టిన డికాక్.. ఆద్యంతం తన ఇన్నింగ్స్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే మూడో ఓవర్లో డికాక్ 12పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను అభిజిత్ తోమర్ వదిలేయడంతో భారీ మూల్యం కేకేఆర్ చెల్లించుకుంది. ఆ ఓవర్లో డికాక్ సిక్స్ బాదాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ అప్పటివరకు ఆచితూచి ఆడగా.. 5ఓవర్లో గేర్ మార్చాడు. సిక్సు, ఫోర్ కొట్టి డికాక్‌తో హిట్టింగ్‌లో జత కట్టాడు. ముఖ్యంగా సౌతీ బౌలింగ్‌ను వీరిద్దరు చెడుగుడు ఆడుకున్నారు. 10వ ఓవర్లో సౌతీ బౌలింగ్లో రాహుల్ రెండు సిక్సర్లు కొట్టి సౌతీని బెంబేలిత్తించాడు.

పిచ్చికొట్టుడు కొట్టిండు
12 ఓవర్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న డికాక్.. ఇక తన జోరు మరింత పెంచాడు. 14ఓవర్లో రాహుల్ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 16ఓవర్లో చక్రవర్తి బౌలింగ్లో వరుసగా రెండు సిక్సులు, ఒక ఫోర్ బాది స్కోరు మూమెంటమ్ పెంచాడు. ఈ క్రమంలో 18వ ఓవర్లో రస్సెల్ బౌలింగ్లో 4బంతికి ఫోర్ కొట్టి డికాక్ ఐపీఎల్లో తన రెండో సెంచరీ నమోదు చేశాడు. ఇక సెంచరీ తర్వాత డికాక్ కేకేఆర్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 19వ ఓవర్ వేసిన సౌథీ వేసిన తొలి బంతికి రాహుల్ సిక్సు కొట్టి డికాక్ కు సింగిల్ తీసిచ్చాడు. ఇక డికాక్ వరుసగా మూడు సిక్సులు కొట్టి సౌథీకి చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో మొత్తం 27పరుగులొచ్చాయి. ఇక చివరి ఓవర్ రసెల్ వేయగా.. డికాక్ తన ప్రతాపాన్ని కొనసాగించాడు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టి 19పరుగులు పిండుకున్నాడు. దీంతో స్కోరు 210కి చేరుకుంది.

తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అభిజీత్ తోమర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్


Click it and Unblock the Notifications
