Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లక్నోకు కావ్య పాప షాక్.. రూ. 8.6 కోట్లు గోవిందా!

IPL Auction 2026: ఐపీఎల్ వేలం అంటేనే వ్యూహాలు ప్రతివ్యూహాలకు వేదిక. ఒక్కోసారి ఆటగాడిని కొనడం కంటే ప్రత్యర్థి జట్టు బడ్జెట్‌ను ఖాళీ చేయడం కూడా ఓ వ్యూహమే. ఐపీఎల్ 2026 మినీ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ కోసం లక్నో ఏకంగా రూ.8.60 కోట్లను వెచ్చించింది. అయితే ఈ భారీ ధర వెనుక ఉన్న అసలు ట్విస్ట్ తెలిస్తే లక్నో ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే.

కావ్యమారన్ ట్రాప్‌లో లక్నో?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ వేలంలోకి వచ్చినప్పుడు మొదట ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. కానీ రెండో రౌండ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ బిడ్డింగ్ మొదలుపెట్టారు. ఆమెతో పోటీ పడి లక్నో ధరను పెంచుకుంటూ పోయింది. చివరికి రూ. 8.60 కోట్ల వద్ద లక్నో అతడిని దక్కించుకుంది. అయితే ఇంగ్లిస్ లక్నోకు దక్కగానే కావ్య మారన్ ఇచ్చిన రియాక్షన్ చూస్తుంటే.. ఆమె కావాలనే లక్నో బడ్జెట్‌ను తగ్గించడానికి ధర పెంచినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Lucknow Super Giants Fall into Kavya Maran Trap Rs 8 6 Crore Shock for Josh Inglis in IPL 2026 Auction

4 మ్యాచ్‌ల కోసం 8 కోట్లా?
జోష్ ఇంగ్లిస్‌ను అంత భారీ ధర పెట్టి కొన్న లక్నోకు అసలు షాక్ ఇక్కడే ఉంది. సమాచారం ప్రకారం.. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో జోష్ ఇంగ్లిస్ వివాహం జరగనుంది. ఈ కారణంగా జోష్ ఇంగ్లిస్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడు. బహుశా అతను కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉందట. అంటే ఒక్కో మ్యాచ్‌కు లక్నో దాదాపు రూ. 2.15 కోట్లు చెల్లిస్తున్నట్టు లెక్క!

పెళ్లి గిఫ్ట్ దక్కినట్టేనా?
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున బుమ్రా వంటి బౌలర్లనే చీల్చి చెండాడిన ఇంగ్లిస్, టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో రెండు సెంచరీలు బాదిన రికార్డు ఇతని సొంతం. 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయగల ఇంగ్లిస్‌కు పెళ్లికి ముందే ఐపీఎల్ రూపంలో రూ. 8.6 కోట్ల భారీ 'వెడ్డింగ్ గిఫ్ట్' దక్కిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

లక్నోకు అవసరమా?
లక్నో సూపర్ జెయింట్స్ వద్ద ఇప్పటికే రిషబ్ పంత్, నికోలస్ పూరన్ వంటి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్లు ఉన్నారు. అంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. సగం సీజన్ అందుబాటులో ఉండని ఆటగాడి కోసం రూ. 8.6 కోట్లు వెచ్చించడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కావ్యమారన్ వ్యూహం, మరోవైపు ఇంగ్లిస్ జట్టులో చేరిన నేపథ్యంలో ఈ వేలం లక్నోకు లాభం చేకూరుస్తుందో లేక భారంగా మారుతుందో వేచి చూడాల్సిందే.

Story first published: Wednesday, December 17, 2025, 12:50 [IST]
Other articles published on Dec 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+