Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Lucknow Squad 2022: అరంగేట్రంలోనే ల‌క్నో టీమ్ అదిరిపోయిందిగా.. కేఎల్ రాహుల్ పూర్తి జ‌ట్టు ఇదే

Lucknow Super Giant 2022: Players List With Price and Full Team For IPL 2022

బెంగ‌ళూరు: ఈ సారి ఐపీఎల్‌లోకి కొత్త‌గా రెండు జ‌ట్లు ప్ర‌వేశించాయి. అందులో ఒక‌టి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కాగా, మ‌రో జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్‌. దీంతో ఈ రెండు టీంలు లీగ్‌లో ఎలా ఆడ‌తాయోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ముగిసిన మెగా వేలంలో లక్నో దూకుడు క‌న‌బ‌రిచింది. విశ్లేష‌కుల‌తోపాటు అభిమానుల నుంచి మంచి ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది.

మొత్తం ఎంత మంది అంటే

మెగా వేలంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మొత్తం 18 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. అంత‌కుముందు రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆట‌గాళ్ల‌తో క‌లుపుకుని ఆ జ‌ట్టులోని మొత్తం ఆట‌గాళ్ల సంఖ్య 21కి చేరుకుంది. మొత్తం వేలం ముగిశాక ఆ జ‌ట్టు ద‌గ్గ‌ర ఒక్క రూపాయి కూడా మిగ‌ల‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో వేలం మొత్తం ముగిశాక అకౌంట్ సున్నాగా ఉన్న ఒకే ఒక జ‌ట్టుగా ఈ లీగ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిలిచింది. కాగా ఇదివ‌ర‌కే త‌మ జ‌ట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియ‌మిస్తున్న‌ట్లు ల‌క్నో మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది. మాజీ క్రికెట‌ర్, ఐపీఎల్‌లో రెండు సార్లు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపిన గౌతం గంభీర్ ఈ జ‌ట్టుకు మెంటార్‌గా ఉండ‌డం విశేషం.

ఎక్కువ ధ‌ర ఎవ‌రికంటే

మెగా వేలంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అత్య‌ధిక ధ‌ర‌ను యువ బౌల‌ర్ ఆవేశ్ ఖాన్ కోసం వెచ్చించింది. ఆవేశ్ ఖాన్‌ను ఆ జ‌ట్టు 10 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. ఆ త‌ర్వాత వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్‌ను 8 కోట్ల 75 లక్ష‌ల‌కు, టీమిండియా ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యాను 8 కోట్ల 25 లక్ష‌ల‌కు ద‌క్కించుకుంది. ఇంగ్లండ్ ఆట‌గాడు మార్క్‌వుడ్‌ను 7 కోట్ల 50 ల‌క్ష‌ల‌కు, సౌతాఫ్రికా ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌ను 6 కోట్ల 75 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. దీప‌క్ హుడాకు రూ.5.75 కోట్లు, మ‌నీష్ పాండేకు రూ. 4.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీనిని బ‌ట్టి టాలెంటెడ్ ఆట‌గాళ్ల‌ను ధ‌ర పెట్టి కొనుగోలు చేయ‌డానికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఏ మాత్రం వెన‌కాడ‌లేద‌ని అర్థ‌మ‌వుతుంది.

బ్యాట‌ర్లు, బౌల‌ర్లు వీళ్లే

ల‌క్నో జ‌ట్టులో బ్యాట‌ర్లుగా కేఎల్‌ రాహుల్‌, క్వింట‌న్‌ డికాక్‌, మనన్‌ వోహ్రా, ఎవిన్‌ లూయిస్, మనీశ్‌ పాండే ఉన్నారు. బౌల‌ర్ల జాబితాలో మార్క్‌ ఉడ్‌, అవేశ్‌ ఖాన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, రవి బిష్ణోయ్‌, దుష్మంత చమీర, షాబాజ్‌ నదీం, మోహ్‌సిన్‌ ఖాన్‌, మయాంక్‌ యాదవ్ ఉన్నారు. ఇక ఆల్‌రౌండ‌ర్లుగా స్టొయినిస్‌, కృష్ణప్ప గౌతమ్‌, బదోని, మేయర్స్‌, హోల్డర్‌, దీపక్‌ హుడా, కృనాల్ పాండ్యా, కరన్‌ శర్మ జ‌ట్టులో ఉన్నారు.

ల‌క్నో పూర్తి జ‌ట్టు ఇదే

కేఎల్‌ రాహుల్‌(17 కోట్లు), మార్కస్ స్టొయినిస్‌(9.2 కోట్లు), రవి బిష్ణోయ్‌(4 కోట్లు), అవేశ్‌ ఖాన్‌(10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య(8.25 కోట్లు), మార్క్‌ వుడ్(7.50 కోట్లు), క్వింటన్ డికాక్‌( 6.75 కోట్లు), దీపక్‌ హుడా(5.75 కోట్లు), మనీశ్‌ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్(90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్‌ మయేర్స్‌(50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్‌( వీరంద‌రికీ 20 లక్షలు).

Story first published: Monday, February 14, 2022, 20:02 [IST]
Other articles published on Feb 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+