Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20కి ఒక్కరోజు ముందే స్టేడియం పేరు మార్చారు..

Lucknow stadium renamed in honour of Atal Bihari Vajpayee ahead of India

హైదరాబాద్: భారత వెస్టిండీస్‌ల మధ్య జరగనున్న రెండో టీ20 వేదికలో ఓ గమ్మత్తైన మార్పు చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరగనుంది. మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా సదరు స్టేడియం పేరు సోమవారం సాయంత్రమే మార్చేశారు. అంతకుముందు స్టేడియం పేరు ఎకనా అంతర్జాతీయ స్టేడియంగా ఉండేది. ఇప్పుడు కాస్తా.. దానిని దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరుమీదుగా మార్చారు.

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ స్టేడియంగా

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ స్టేడియంగా

‘భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంతర్జాతీయ స్టేడియం'గా మార్చేశారు. స్టేడియం పేరును మార్చేస్తున్నట్లు రాష్ట్ర గృహ, పట్టణ ప్రణాళిక విభాగం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. లక్నోలో 24ఏళ్ల తర్వాత మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగబోతుంది. అయితే మ్యాచ్‌‌కు ఒక్కరోజు ముందే ప్రభుత్వం స్టేడియం పేరును మార్చేయడం గమనార్హం.

స్టేడియం పేరు మార్పునకు అంగీకరించిన గవర్నర్‌

స్టేడియం పేరు మార్పునకు అంగీకరించిన గవర్నర్‌

‘ఆర్టికల్‌ 17.5.1 ప్రకారం లక్నో డెవెలప్‌మెంట్‌ అథారిటీ, ఎకనా స్పోర్ట్స్‌ సిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జీసీ కన్స్‌ట్రక్షన్స్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల ఒప్పందం ప్రకారం.. స్టేడియం పేరు మార్పు ప్రతిపాదనలను గవర్నర్‌కు అందజేయగా పేరు మార్పునకు అంగీకరించారు' అని అధికారులు నోటీసులో వెల్లడించారు.

ప్రతిపక్ష పార్టీ విమర్శల దాడి

ప్రతిపక్ష పార్టీ విమర్శల దాడి

గోమతి నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ సెక్టార్‌ 7లో ఉన్న క్రికెట్‌ స్టేడియాన్ని మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రారంభించారు. స్టేడియం పేరు మార్పుపై ప్రతిపక్ష సమాజ్‌వాద్ పార్టీ విమర్శల దాడి మొదలైంది. అధికార పార్టీ తాము సొంతగా ప్రజలకు పనికొచ్చే పనులు ఏమీ చేయడం లేదని సమాజ్ వాద్ పార్టీ అధికార ప్రతినిధి సునీల్‌ సింగ్‌ ఆరోపించారు.

మాజీ ప్రధాని అటల్‌జీకి ఇచ్చే నివాళి

మాజీ ప్రధాని అటల్‌జీకి ఇచ్చే నివాళి

ప్రదేశాలు, నగరాల పేర్లు మారుస్తున్నారని ఇందులో ప్రజలకు ఒడిగట్టేదేమిటని ప్రశ్నించారు. సొంతగా ప్రజల కోసం ఏం చేయకుండా ఈ పేర్లు మార్పు ఎందుకుని విమర్శించారు. మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్ కృషితోనే లక్నోలో అంతర్జాతీయ స్టేడియం ఏర్పాటైందని తెలిపారు. తమ సమాజ్‌వాదీ పార్టీ నుంచి మాజీ ప్రధాని అటల్‌జీకి ఇచ్చే నివాళి అంటూ పేర్కొన్నారు.

Story first published: Tuesday, November 6, 2018, 14:39 [IST]
Other articles published on Nov 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+