విందు: రైనా పెళ్లిలో సందడి చేయనున్న 'తుండే కబాబి' చెఫ్‌లు (ఫోటోలు)
న్యూఢిల్లీ: టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. సురేష్ రైనా వివాహం తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరీతో శుక్రవారం జరగనుంది. రైనా వివాహానికి టీమిండియా జట్టు సభ్యులతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రైనా పెళ్లికి విందు అద్భుతంగా ఉండాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా లక్నోలో పేరుగాంచిన 'తుండే కబాబి' రెస్టారెంట్‌కు చెందిన వారిని ఢిల్లీ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
లక్నోలోని అమీనాబాద్ ప్రాంతంలో ఉండే 'తుండే కబాబి' రెస్టారెంట్‌కు సురేష్ రైనా సమయం దొరికినప్పుడల్లా వెళ్తుంటాడు. ఆ రెస్టారెంట్‌కు చెందిన చెఫ్ రెహ్మాన్, అతని సహాయకులు ఇప్పుడు సురేష్ రైనా వివాహంలో అదిపోయే వంటలను తయారు చేయనున్నారు.

రైనా పెళ్లి: విందు కోసం 'తుండే కబాబి' నుంచి నలభీములు
వీరితో బిర్యానీ, లక్నో స్టయిల్ గలౌటీ కబాబులు, మటన్ కుర్మా, షీర్మల్ వంటి నోరూరించే వంటలను తయారు చేయించి పెళ్లికి వచ్చే అతిధులకు వడ్డించనున్నారు.

రైనా పెళ్లి: విందు కోసం 'తుండే కబాబి' నుంచి నలభీములు
రైనా వివాహానికి అటు రాజకీయనాయకులతో పాటు ఇటు క్రికెటర్లు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు.

రైనా పెళ్లి: విందు కోసం 'తుండే కబాబి' నుంచి నలభీములు
వీరి వివాహానికి బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియా, ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్, బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రి, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు హాజరుకానున్నారు.

రైనా పెళ్లి: విందు కోసం 'తుండే కబాబి' నుంచి నలభీములు
రైనా పెళ్లికి మొత్తం 270కు పైగా అతిథులు రానున్నారు. ఎక్కువ మంది అతిధులు లక్నో నుంచి హాజరుకానున్నారు. కారణం రైనా తన జీవితంలో ఎక్కువ భాగాన్ని లక్నో గడపటమే.

రైనా పెళ్లి: విందు కోసం 'తుండే కబాబి' నుంచి నలభీములు
బుధవారం నాడు జరిగిన కార్యక్రమానికి కేవలం కుటుంబానికి పరిమితమైందని రైనా సన్నిహితులు తెలిపారు. తొలుత రైనా పెళ్లిన ఏప్రిల్ 8న నిర్వహించాలనుకున్నారు. కానీ, అదే నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుండటంతో పెళ్లి తేదీని మార్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications