Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Lucknow Playing 11 For IPL 2022: ప్ర‌పంచ‌స్థాయి ఆల్‌రౌండ‌ర్ల‌కు చోటు.. బౌలింగ్ భారం యువ‌కుల‌పైనే!

Lucknow Playing 11 For IPL 2022: 3 Members Star All Rounders In the Team.. The burden of bowling is on the youngsters

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022మ‌రో 5 రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే ప్రాక్టీసులో మునిగితేలాయి. అలాగే తమ తుది జ‌ట్ల‌పై కూడా ఇప్ప‌టి నుంచే క‌స‌రత్తులు మొద‌లుపెట్టాయి. ఇందులో భాగంగానే ఈ సారి ఐపీఎల్‌లోకి కొత్త‌గా వచ్చిన కేఎల్ రాహుల్ నేతృత్వంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తుది జ‌ట్టు ఎంపిక‌ ఆస‌క్తిక‌రంగా మారింది.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పూర్తి జ‌ట్టు

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పూర్తి జ‌ట్టు

కేఎల్‌ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), అవేశ్‌ ఖాన్ (10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య (8.25 కోట్లు), మార్క్‌ వుడ్ (7.50 కోట్లు), క్వింటన్ డికాక్ ( 6.75 కోట్లు), దీపక్‌ హుడా (5.75 కోట్లు), మనీశ్‌ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్‌ మయేర్స్ (50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్‌( వీరంద‌రికీ 20 లక్షలు).

ఓపెన‌ర్లుగా వాళ్లు ఫిక్స్‌

ఓపెన‌ర్లుగా వాళ్లు ఫిక్స్‌

మొత్తం 20 మంది స‌భ్యులు గ‌ల ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో తుది జ‌ట్టు ఎంపిక ఆస‌క్తిరంగా మారింది. అయితే ఆ జ‌ట్టు ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కేఎల్ రాహుల్, వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్ ప్రారంభించ‌డం ఖాయ‌మ‌నే చెప్పుకోవాలి. టీ20 క్రికెట్‌లో, ఐపీఎల్‌లో వీరిద్ద‌రి స‌త్తా గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే టీ20ల్లో ఓపెన‌ర్లుగా రాహుల్‌, డికాక్‌కు కావాల్సినంత అనుభ‌వం కూడా ఉంది.

మిడిలార్డ‌ర్ వారితో భ‌ర్తీ

మిడిలార్డ‌ర్ వారితో భ‌ర్తీ

మూడో స్థానంలో మ‌నీష్ పాండే బ్యాటింగ్ చేయ‌నున్నాడు. ఇక నాల్గో స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మార్కస్ స్టొయినిస్ రానున్నాడు. ఐదో స్థానంలో దీప‌క్ హుడా ఆడే అవ‌కాశాలు ఉన్నాయి. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండ‌ర్లు కృనాల్ పాండ్యా, జేస‌న్ హోల్డ‌ర్ బ్యాటింగ్‌కు రానున్నాడు. దీనిని బ‌ట్టి చూస్తే ల‌క్నో బ్యాటింగ్ ఆర్డ‌ర్ మొత్తం బ‌లంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్ర‌పంచ‌స్థాయి ఆల్‌రౌండ‌ర్లతో జ‌ట్టు క‌ళ‌క‌ళలాడుతుంది. ఇక మిడిలార్డ‌ర్ భారీ హిట్ట‌ర్ల‌తో ఉంది.

బౌల‌ర్లుగా వీళ్లే

బౌల‌ర్లుగా వీళ్లే

ఇక బౌల‌ర్లుగా టీమిండియా యువ ఆట‌గాళ్లు ఆవేష్ ఖాన్, ర‌వి బిష్ణోయ్ స్థానాలు ఖాయ‌మ‌ని భావించాలి. పేస్‌లో ఆవేష్ ఖాన్‌, స్పిన్‌లో ర‌వి బిష్ణోయ్ ల‌క్నోకు అతి పెద్ద బ‌లాలుగా పేర్కొన‌వ‌చ్చు. వీరితోపాటు మ‌రో పేస‌ర్ దుష్మాంత చ‌మీరాకు కూడా తుది జ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అలాగే మ‌రో స్పిన్న‌ర్‌గా కృష్ణ‌ప్ప గౌతం, షాబాజ్ నదీమ్‌లో ఒక‌రు బ‌రిలోకి దిగ‌నున్నారు. దీనిని బ‌ట్టి చూస్తే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బౌలింగ్ భారాన్ని యువ ప్లేయ‌ర్లే మోయ‌నున్నారు. కానీ వారిలో టాలెంట్‌కు కొద‌వ లేద‌నే చెప్పుకోవాలి. మొత్తంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు పేప‌ర్‌పై బ‌లంగా కనిపిస్తోంది. మైదానంలోనూ స్థాయికి త‌గ్గ ఆట తీరు క‌న‌బరిస్తే లీగ్‌లో ల‌క్నోకు తిరుగుండ‌క‌పోవ‌చ్చు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తుది జ‌ట్టు (అంచ‌నా)

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తుది జ‌ట్టు (అంచ‌నా)

కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింట‌న్ డికాక్ (వికెట్ కీప‌ర్), మ‌నీష్ పాండే, మార్క‌స్ స్టోయినీస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, జేస‌న్ హెల్డ‌ర్‌, కృష్ణ‌ప్ప గౌతం లేదా షాబాజ్ నదీమ్‌, దుష్మంత చ‌మీరా, ఆవేష్ ఖాన్‌, ర‌వి బిష్ణోయ్‌.

Story first published: Sunday, March 20, 2022, 12:18 [IST]
Other articles published on Mar 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+