Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పు తెచ్చుకున్న బ్యాట్‌తో అదరగొట్టాడు.. వైభవ్ సూర్యవంశీ టీమ్ మేట్ విధ్వంసం!

మేజర్ లీగ్ క్రికెట్ 2026 సీజన్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడైన సౌతాఫ్రికా యువ సెన్సేషన్ లూవాన్-డ్రే ప్రిటోరియస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున బరిలోకి దిగిన ఈ 20 ఏళ్ల బ్యాటర్, ఎంఐ న్యూయార్క్‌పై విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 52 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 102 పరుగులు చేసి.. మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ భీకర బౌలింగ్ ధాటికి పరుగుల వరద పారించలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ప్రిటోరియస్ తొలి ఓవర్ నుంచే పరుగుల దాడి చేయడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే శాన్ ఫ్రాన్సిస్కో అలవోకగా విజయం సాధించింది.

Luan-dre Pretorius playing a shot in MLC 2026

ఫిన్ అలెన్ బ్యాట్‌తో సరికొత్త సంచలనం

భారీ హిట్టింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించిన ఈ మెరుపు ఇన్నింగ్స్ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ప్రిటోరియస్ ఈ రికార్డు ఇన్నింగ్స్ ఆడింది తన సొంత బ్యాట్‌తో కాదు. తన ఓపెనింగ్ భాగస్వామి ఫిన్ అలెన్ బ్యాట్‌ను అడిగి మరి తీసుకున్నాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న తర్వాత ప్రిటోరియస్ నవ్వుతూ.. "నేను ఫిన్ అలెన్ బ్యాట్‌తో ఆడాను. నా బ్యాట్‌తో ఆడితే బహుశా ఇన్ని భారీ సిక్సర్లు కొట్టలేకపోయేవాడిని. ఇప్పుడు ఎలాగైనా ఈ బ్యాట్‌ను నా బ్యాగ్‌లో శాశ్వతంగా పెట్టేసుకోవాలి" అని పేర్కొన్నాడు.

ఈ అద్భుత విజయంతో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను పెంచుకుంది. ప్రస్తుత టోర్నమెంట్‌లో ప్రిటోరియస్ వరుస హాఫ్ సెంచరీలతో భీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు 69.16 అద్భుతమైన సగటుతో, 182.01 వేగవంతమైన స్ట్రైక్ రేట్‌తో టోర్నీలోనే అత్యధికంగా 415 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. గతంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆటగాడు మిచేల్ ఓవెన్ నెలకొల్పిన అత్యంత పిన్న వయస్కుడి సెంచరీ రికార్డును ప్రిటోరియస్ ఈ మ్యాచ్‌తో బ్రేక్ చేశాడు.

అంతకుముందు ఎంఐ న్యూయార్క్ జట్టులో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 35 పరుగులు చేయగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ 19 పరుగులకే పరిమితమయ్యాడు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున కెప్టెన్ మాథ్యూ షార్ట్ బాల్‌తో అద్భుతంగా రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. పేసర్లు హరీస్ రవూఫ్, ఆరోన్ హార్డీ చెరో రెండు వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. ప్రిటోరియస్ సెంచరీ షోతో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు ఈ టోర్నీలో మరింత ముందంజ వేసే దిశగా సాగుతోంది.

Story first published: Thursday, July 9, 2026, 18:27 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+