Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsSRH : బ్రూక్‌ను అలా బుట్టలో వేసుకున్నా: రవి బిష్ణోయి

ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆడిన రెండో మ్యాచులో కూడా కీలక ఆటగాడు హ్యారీ బ్రూక్ విఫలమయ్యాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ పిచ్‌పై కూడా తడబడిన బ్రూక్.. లక్నోలో ఎదురైన టఫ్ పిచ్‌పై ఏమాత్రం ఆకట్టుకోలేదు. కేవలం మూడు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై సన్‌రైజర్స్ అభిమానులు మండి పడుతున్నారు. ఇంత ఘోరమైన బ్యాటర్ కోసం కావ్య ఏకంగా రూ.13 కోట్లు ఖర్చు పెట్టిందా? అని అడుగుతున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ను రవి బిష్ణోయి చాలా తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన అతనికి వరుసగా రెండు ఫుల్ లెంగ్త్ డెలివరీలు వేశాడు. దీంతో మూడో డెలివరీ కూడా అలాగే వస్తుందని బ్రూక్ అనుకున్నాడు. అదే అతను చేసిన పొరపాటు. ఇక్కడే రవి బిష్ణోయి తెలివి తేటలు ప్రదర్శించాడు. అద్భుతమైన డెలివరీతో బ్రూక్‌ను బోల్తా కొట్టించాడు.

harry brook ravi bishnoi

రెండు డెలివరీలు ఫుల్ లెంగ్త్ అవడంతో మూడో డెలివరీ కూడా అలాగే వస్తుందని బ్రూక్ భావించాడు. అందుకే ముందుకొచ్చి ఆ బంతిని ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ఇలా జరుగుతుందని ముందే గ్రహించిన బిష్ణోయి.. మూడో డెలివరీని కొంచెం షార్ట్ పిచ్‌లో ఆఫ్ స్టంప్‌కు ఆవలగా వేశాడు. దీంతో దాన్ని ఆడటంలో బ్రూక్ విఫలమయ్యాడు. అతన్ని తప్పించుకున్న బంతిని కీపర్ నికోలస్ పూరన్ సులభంగా పట్టేశాడు.

అతను వెంటనే వికెట్లను కూల్చడంతో బ్రూక్ స్టంపౌట్ అయి పెవిలియన్ చేరాడు. ఇలా ఎలా ప్లాన్ చేశావని బిష్ణోయిని అడిగితే.. 'ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి క్రీజులో నిలబడి అతను బ్యాటింగ్ చేయలేడు. దీంతో తను కచ్చితంగా ముందుకొచ్చి ఆడతాడని అనుకున్నా. అదే జరిగింది. అందుకే ఆఫ్‌స్టంప్ అవతలకు బంతి వేశా. ఫలితం దక్కింది' అని నవ్వుతూ చెప్పాడు. ఏదేమైనా వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమైన బ్రూక్‌పై తర్వాతి మ్యాచ్‌లో విపరీతమైన ఒత్తిడి ఉండటం గ్యారంటీ.

Story first published: Saturday, April 8, 2023, 10:04 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+