ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రెండు జట్లు విజయం కోసం గట్టిగా పోటీ పడేందుకు రెడీగా ఉన్నాయి. తమ తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన సన్‌రైజర్స్ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని అనుకుంటోంది. లక్నో పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేసేందుకు కొందరు బ్యాటర్లు రెడీగా ఉన్నారు.
కేఎల్ రాహుల్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కొంచెం మంచి టచ్‌లో ఉన్నట్లే కనిపిస్తున్నా మంచి స్కోర్ చేయలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అతనికి మంచి ఆరంభం దక్కింది. కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రాణించిన అతను ఈ ఐపీఎల్‌లో కూడా సత్తా చాటాలని అనుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో కలిపి 28 పరుగులే చేశాడు. దీంతో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై చెలరేగేందుకు రాహుల్ రెడీగా ఉన్నాడు.

ఎయిడెన్ మార్క్రమ్: అంతర్జాతీయంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మరో ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్. ఇటీవల నెదర్లాండ్స్‌పై 175 పరుగులతో సత్తా చాటిన మార్క్రమ్.. గతేడాది కాలంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత ఐపీఎల్‌లో కూడా 14 మ్యాచుల్లో 381 పరుగులతో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా తను రాణించడంతోపాటు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ట్రోఫీ కూడా అందించాడు. ఇదే ఫామ్‌ను ఈ ఐపీఎల్‌లో కూడా కొనసాగించాలని మార్క్రమ్ ఎదురు చూస్తున్నాడు.
దీపక్ హుడా: కొంత కాలంగా బ్యాటింగ్‌లో తడబడుతున్న టీమిండియా టీ20 స్పెషలిస్ట్ దీపక్ హుడా. ఈ ఐపీఎల్‌లో కూడా హుడా తడబడ్డాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించినా భారీ స్కోరు చెయ్యలేకపోయాడు. చెన్నైపై తేలిపోయాడు. దేశవాళీల్లో రాణించిన అతను.. ఆ ఫామ్‌ను ఐపీఎల్‌లో కూడా ప్రదర్శించాలని, తద్వారా భారత టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై చెలరేగేందుకు రెడీగా ఉన్నాడు.