Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsSRH : బ్యాటర్లకు బీపీ పెంచే బౌలర్లు.. టాప్ వికెట్లు తీసుకునేది వీళ్లే!

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రెండు జట్లు విజయం కోసం గట్టిగా పోటీ పడేందుకు రెడీగా ఉన్నాయి. తమ తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన సన్‌రైజర్స్ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని అనుకుంటోంది. లక్నో పిచ్ బ్యాటింగ్‌కు సహకరించినా బౌలర్లు కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో బ్యాటర్లను బెంబేలెత్తించేందుకు కొందరు బౌలర్లు రెడీ అవుతున్నారు.

నటరాజన్: సన్‌రైజర్స్ జట్టులో కీలకమైన బౌలర్ నటరాజన్. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిగతా బౌలర్లంతా భారీగా పరగులు ఇచ్చినా కూడా నటరాజన్ రాణించాడు. మూడు ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. తొలి ఓవర్లోనే 17 పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత రెండు ఓవర్లలో కేవలం ఆరు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. లక్నోతో మ్యాచులో కూడా నటరాజన్ ఇదే ఫామ్ కొనసాగించి, మరిన్ని వికెట్లు తీసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

LSGvsSRH Today IPL match These bowlers will take most wickets

మార్క్ వుడ్: ప్రస్తుతం ఐపీఎల్‌లో బెస్ట్ బౌలర్ మార్క్ వుడ్. ఢిల్లీతో మ్యాచులో ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్న అతను.. రెండో మ్యాచులో మూడు వికెట్లతో రాణించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2023లో టాప్ వికెట్ టేకర్ అతనే. లక్నో పిచ్ బౌలర్లకు కూడా మంచి సహకారం అందిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మార్క్ వుడ్ చెలరేగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన పేస్, ఆడటం కష్టంగా ఉండే లైన్ అండ్ లెంగ్త్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు వుడ్ రెడీగా ఉన్నాడు.

రవి బిష్ణోయి: ఈ ఐపీఎల్ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్ల జాబితాలో జాయింట్ సెకండ్ ప్లేస్‌లో ఉన్న బౌలర్ రవి బిష్ణోయి. ఈ యువ లెగ్ స్పిన్నర్ రెండు మ్యాచుల్లో ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. సాధారణంగానే సన్‌రైజర్స్‌పై అతని రికార్డు మెరుగ్గా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నో జట్టుకు బిష్ణోయి బౌలింగ్ చాలా కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లను కూడా బిష్ణోయి ఇబ్బంది పెట్టాడు. మరి సన్‌రైజర్స్ అతన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Story first published: Friday, April 7, 2023, 17:25 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+