Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsSRH : లక్నో స్పిన్నర్ల ధాటికి.. తేలిపోయిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. టార్గెట్ ఎంతంటే?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్లు చెలరేగారు. ఆరంభంలో కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయి బౌలింగ్‌ను ఆడటంలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఏమాత్రం ఆడలేకపోయారు. పిచ్‌లో అంత బౌన్స్ లేకపోవడాన్ని గమనించిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.. పవర్‌ప్లేలోనే కృనాల్ పాండ్యాను రంగంలోకి దించాడు. ఈ నిర్ణయం కరెక్ట్ అని నిరూపించిన అతను.. తన తొలి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ (8)ను అవుట్ చేశాడు.

ఆ తర్వాత అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (31)ని కూడా పాండ్యా అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే ఎయిడెన్ మార్క్రమ్ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ కుదేలైంది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రూ.13 కోట్ల బ్యాటర్ హ్యారీ బ్రూక్ (3) కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. తొలి మ్యాచ్‌లో అవుటైనట్లే స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అలాంటి పరిస్థితుల్లో రాహుల్ త్రిపాఠీ (34), వాషింగ్టన్ సుందర్ (16) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు.

LSGvsSRH Today IPL match Sunrisers caught in web of spin

త్రిపాఠీ, సుందర్ ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో పరమ జిడ్డు బ్యాటింగ్ చేశారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా వీళ్లు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత యువ బౌలర్ యష్ ఠాకూర్ బౌలింగ్‌లో బౌండరీ బాదే క్రమంలో త్రిపాఠీ అవుటయ్యాడు. త్రిపాఠీ కొట్టిన బంతిని 40 ఏళ్ల అమిత్ మిశ్రా అద్భుతంగా డైవ్ చేసి మరీ పట్టేశాడు. దీంతో త్రిపాఠీ మైదానం వీడాల్సి వచ్చింది.

ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, అదిల్ రషీద్ (4) ఇద్దర్నీ అమిత్ మిశ్రా అవుట్ చేశాడు. వీళ్లిద్దరూ భారీ షాట్లు ఆడబోయి పెవిలియన్ చేరారు. అయితే చివరి ఓవర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 21 నాటౌట్) రెండు భారీ సిక్సర్లు బాదాడు. సమద్ సిక్సర్ల కారణంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందుతున్న క్రమంలో ఈ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కాపాడుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Story first published: Friday, April 7, 2023, 21:25 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+