Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsSRH : నలభై ఏళ్ల వయసులో చిరుతలా క్యాచ్.. మిశ్రాపై నెట్టింట పేలుతున్న మీమ్స్!

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన అమిత్ మిశ్రా చెలరేగాడు. స్పిన్ ఆడేందుకు తడబడుతున్న సన్‌రైజర్స్‌ను తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. దానికతోడు ఫీల్డింగ్‌లో కూడా చురుగ్గా కదులుతూ అందర్నీ ఆకర్షించాడు. యువ బౌలర్ యష్ ఠాకూర్ వేసిన షార్ట్ బాల్‌ను ర్యాంప్ షాట్ ఆడేందుకు త్రిపాఠీ ప్రయత్నించాడు.

ఆ సమయంలో కీపర్‌కు కుడివైపున మిశ్రా ఫీల్డింగ్ చేస్తున్నాడు. త్రిపాఠీ కొట్టిన బంతి అతని పక్క నుంచి బౌండరీ వైపు వెళ్తోంది. మిశ్రా కనుక వదిలేస్తే అది కచ్చితంగా బౌండరీ వెళ్లేదే. కానీ 40 ఏళ్ల వయసున్న మిశ్రా కుర్రాడిలా కదులుతూ వేగంగా తన ఎడమ వైపు దూకాడు. అద్భుతంగా డైవ్ చేస్తూ ఆ బంతిని క్యాచ్ పట్టేశాడు. ఆ క్యాచ్ చూసిన లక్నో జట్టు సభ్యులంతా ఆశ్చర్యపోయారు.

Amit Mishra takes stunning catch

త్రిపాఠీ కూడా షాకైనా చేసేదేం లేక పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి వచ్చిన మిశ్రా.. క్రీజులో కుదురుకొని భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్న వాషింగ్టన్ సుందర్ (16)ను అవుట్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అదిల్ రషీద్ (4) ఒక బౌండరీ బాదాడు. కానీ ఆ మరుసటి బంతికే మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతోపాటు చివర్లో రెండు వికెట్లు కూడా తీసిన అమిత్ మిశ్రాను నెట్టింట అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ రెండు వికెట్లతో ఐపీఎల్ చరిత్రలో మిశ్రా తీసిన వికెట్ల సంఖ్య 168కి చేరింది. ఇదంతా చూసిన అభిమానులు.. ఆటకు వయసుతో సంబంధం లేదని మిశ్రా నిరూపించాడని అంటున్నారు. మరికొందరేమో 'ముసలాడే కానీ.. మహానుభావుడు' అంటూ సినిమా డైలాగులతో మిశ్రాను మెచ్చుకుంటున్నారు.

Story first published: Friday, April 7, 2023, 22:08 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+