సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతనికి ఫ్లూ సోకిందని, దాంతో అతను ఈ మ్యాచ్ ఆడటం లేదని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. అలాగే మరో పేసర్ ఆవేష్ ఖాన్ కూడా గాయపడ్డాడని, అతన్ని కూడా పక్కన పెట్టామని వెల్లడించాడు. అయితే టాస్ ఓడిన తర్వాత ప్రకటించిన జట్టులో సబ్‌స్టిట్యూట్‌గా అతని పేరు ప్రకటించాడు.
లక్నోలోని ఏకానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ టాస్ గెలిచాడు. పిచ్ కొంత డ్రైగా కనిపిస్తోందని చెప్పిన అతను ముందుగా తాము బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న తొలి కెప్టెన్ మార్క్రమ్ కావడం గమనార్హం. స్కోరు బోర్డుపై మంచి టార్గెట్ నిలిపేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు.

జట్టులో అందరూ మంచి మూడ్‌లో ఉన్నారని, ఫుల్ ఎనర్జీతో బరిలో దిగేందుకు రెడీగా ఉన్నారని చెప్పాడు. అలాగే తాము ముందుగా బ్యాటింగ్ చేస్తున్నందున అన్‌మోల్ ప్రీత్ సింగ్‌ను ఓపెనర్‌గా తీసుకున్నట్లు మార్క్రమ్ ప్రకటించాడు. ఈ క్రమంలో గతేడాది జట్టు తరఫున రాణించిన అభిషేక్ శర్మను పక్కన పెట్టేసింది సన్‌రైజర్స్ యాజమాన్యం. అన్‌మోల్ ప్రీత్ సింగ్‌ను కీపర్‌గా ప్రకటించింది.
దీంతో సన్‌రైజర్స్ జట్టులో కేవలం ముగ్గురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. కాబట్టి అవసరాన్ని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌గా మరో విదేశీ ఆటగాడిని తీసుకునే ఛాన్స్ ఉంది. సన్‌రైజర్స్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల జాబితాలో కివీస్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్, సఫారీ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్ ఉన్నారు. వీరితోపాటు రాజస్థాన్ మ్యాచ్‌లో రాణించిన ఫజల్లాక్ ఫరూఖీ కూడా ఉన్నాడు. వీరిలో ఎవరో ఒకరికి మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆడే అవకాశం దక్కడం గ్యారంటీగా కనిపిస్తోంది.
సన్‌రైజర్స్ జట్టు: మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, అదిల్ రషీద్
సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు: హెన్రిక్ క్లాసెన్, ఫజల్లాక్ ఫరూఖీ, మయాంక్ మార్కండే, మయాంక్ దాగర్, మార్కో జాన్సెన్
లక్నో జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, డీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, రొమేరియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యష్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయి
సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు: ఆయుష్ బదోనీ, స్వప్నిల్ సింగ్, డానియల్ శామ్స్, ప్రేరక్ మన్కడ్, ఆవేష్ ఖాన్