Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsSRH : మార్క్రమ్ ముందున్న అతి పెద్ద సవాల్ అదే: సెహ్వాగ్

లక్నోతో వాళ్ల సొంత మైదానంలో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. కీలక ఆటగాళ్లు అందరూ జట్టుతో చేరడంతో సన్‌రైజర్స్ బలంగా కనిపిస్తోంది. అయితే మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో తొలిసారి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ స్కిల్స్‌కు పరీక్ష ఎదురవుతుందని మాజీలు చెప్తున్నారు.

టీమిండియా మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే విషయాన్ని ఎత్తి చూపాడు. సన్‌రైజర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో మార్క్రమ్ లేడు. అప్పుడు అతను సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ కోసం వెళ్లాడు. ఇప్పుడు తొలిసారి సన్‌రైజర్స్ కెప్టెన్‌గా బరిలో దిగేందుకు రెడీ అయ్యాడు. తొలి మ్యాచ్‌లో కూడా మంచి ఆటగాళ్లు ఉన్నా కూడా రాజస్థాన్ చేతిలో సన్‌రైజర్స్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుచేశాడు.

Aiden Markram captaincy will be tested

'ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వానికి ఇది గట్టి పరీక్ష. సౌతాఫ్రికాలో టీ20 లీగ్‌ను మార్క్రమ్ గెలిచాడు. కానీ ఇది అతనికి ఒక కొత్త పరీక్ష. సన్‌రైజర్స్ టీంలో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కానీ వాళ్లంతా ఒక జట్టులా కలిసి ఆడేలా చేయడమే చాలా పెద్ద సవాల్' అని సెహ్వాగ్ వివరించాడు. ఢిల్లీ మాజీ ఆల్‌రౌండర్ రజత్ భాటియా కూడా మార్క్రమ్ గురించి తన అభిప్రాయం చెప్పాడు.

విదేశీ కెప్టెన్లకు ఐపీఎల్‌లో పెద్ద సమస్య.. లోకల్ కుర్రాళ్లలో ట్యాలెంట్‌ను గుర్తించడమే అని భాటియా చెప్పాడు. దేశవాళీల్లో రాణించిన ఆటగాళ్ల బలాలు, బలహీనతలను మార్క్రమ్‌కు వివరించడంలో కోచింగ్ సిబ్బంది పాత్ర చాలా కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. నేరుగా జట్టులో ఆడేందుకు మార్క్రమ్ వస్తున్నాడని, కాబట్టి దేశవాళీ ప్లేయర్ల గురించి అతనికి ఎంత వరకు తెలుసో అప్పుడే చెప్పలేమని అన్నాడు.

Story first published: Friday, April 7, 2023, 18:44 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+