Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsSRH : ఆ ఒక్కడే తేడా.. టఫ్ పిచ్‌పై లక్నో సూపర్ విక్టరీ!

సన్‌రైజర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. పిచ్ టఫ్‌గా ఉండటంతో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఆడిన వారిలో ఫర్వాలేదనిపించింది కేవలం కొత్త కుర్రాడ్ అన్‌మోల్ ప్రీత్ సింగ్ (31) ఒక్కడే.

సన్‌రైజర్స్ టాప్ స్కోరర్ రాహుల్ త్రిపాఠీ (41 బంతుల్లో 34) చాలా నెమ్మదిగా ఆడాడు. మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో సన్‌రైజర్స్ కేవలం 121/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఎయిడెన్ మార్క్రమ్ ముగ్గుర్నీ అవుట్ చేశాడు.

LSGvsSRH Lucknow defeated Sunrisers comfortably

లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ (13) త్వరగానే అవుటయ్యాడు. దీపక్ హుడా (7) కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 35 పరుగులతో తనకు అలవాటైన ఆటనే ఆడాడు. అయితే మరోసారి కృనాల్ పాండ్యా జట్టును విజయానికి చేరువ చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను కేవలం 23 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. వేగంగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు.

ఆ తర్వాత సన్‌రైజర్స్ స్పిన్నర్ అదిల్ రషీద్.. వరుస బంతుల్లో కేఎల్ రాహుల్, రొమేరియో షెఫర్డ్ (0)ను అవుట్ చేశాడు. అయితే చివర్లో స్టొయినిస్ (10 నాటౌట్)తో కలిసి నికోలస్ పూరన్ (11 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. నటరాజన్ వేసిన 16వ ఓవర్ చివరి బంతికి భారీ సిక్సర్ బాదిన పూరన్.. జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ చూసిన వాళ్లందరూ కూడా కృనాల్ పాండ్యా ఒక్కడే రెండు జట్ల మధ్య తేడా అంటున్నారు. బంతితోపాటు బ్యాటుతోనూ రాణించిన కృనాల్.. లక్నో విజయాన్ని సులభం చేశాడని మెచ్చుకుంటున్నారు.

Story first published: Friday, April 7, 2023, 23:02 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+