చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా లక్నో యంగ్ పేసర్ ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఈ పరుగులు చేయకుండా రాజస్థాన్‌ను నిలువరించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి మూటగట్టుకుంది ఆర్ఆర్ జట్టు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో చాలా చిన్నగా తమ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌ను రాహుల్ మెయిడెన్ చేశాడు. కైల్ మేయర్స్ (51), కేఎల్ రాహుల్ (39) ఇద్దరూ పరమ జిడ్డు బ్యాటింగ్ చేశారు. ఎక్కడా బౌలర్లపై ఎదురు దాడికి దిగలేదు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో రాజప్థాన్ విఫలమైంది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అద్భుంగా పోరాడారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ జట్టు ప్రధాన బ్యాటర్లకు భారీ షాట్లు ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అద్భుతంగా బౌలింగ్ చేసిన అశ్విన్.. తన నాలుగు ఓవర్లలో కైల్ మేయర్స్, దీపక్ హుడా ఇద్దర్నీ తన బుట్టలో వేసుకున్నాడు. వీళ్లిద్దరూ భారీ షాట్లు ఆడదాం అనుకునే సమయంలో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
ఇక బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశం లేకపోయినా.. తను వేగంగా సింగిల్స్ తీసి క్రీజులో ఉన్న రియాన్ పరాగ్‌కు భారీ షాట్లు ఆడే అవకాశం కూడా కల్పించాడు. అశ్విన్ ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడం చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. అశ్విన్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దని సలహాలు ఇస్తున్నారు. క్రికెట్‌లో ఎవరికైనా పీహెచ్‌డీ ఉంటే అది అశ్విన్‌కే అని అంటున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి అశ్విన్ అద్భుతంగానే రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు అతను ఆరు మ్యాచులు ఆడాడు. వీటన్నింటిలో కలిపి 8 వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా అతను మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే 30పైగా పరుగులు ఇచ్చాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. అశ్విన్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.