Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsPBKS : అందరూ ఆడినా.. వాళ్లిద్దరి వల్లే గెలిచాం: శామ్ కర్రాన్

ఐపీఎల్‌లో లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మంచి రికార్డున్న జట్టును.. వాళ్ల సొంత మైదానంలో ఓడించడం అంటే మాటలు కాదు. కానీ పంజాబ్ కింగ్స్ అదే చేసి చూపించింది. తమ చివరి 9 మ్యాచుల్లో 8 మ్యాచులను లక్ష్యాన్ని కాపాడుకుంటూనే గెలిచిందా జట్టు. అలాంటి జట్టుతో లక్నోలో తలపడుతూ కూడా అసాధారణంగా పోరాడింది పంజాబ్ కింగ్స్. ఫలితంగానే లక్నో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. పంజాబ్ టార్గెట్ ఛేజ్ చేసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌లో కీలక వికెట్ తీసుకున్న అతను.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. అద్భుతమైన పోరాటంతో తన కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే తొలి వికెట్ తీసుకున్న, హాఫ్ సెంచరీ చేసిన జింబాబ్వే ఆటగాడిగా రికార్డు కూడా సృష్టించాడు. కానీ అతన్ని అవుట్ చేసిన లక్నో మళ్లీ పైచేయి సాధించింది. కానీ షారూఖ్ ఖాన్ వచ్చి ఆ ఆశలపై నీళ్లు చల్లాడు.

sam curran punjab kings

ఈ విజయం అనంతరం మాట్లాడుతూ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శామ్ కర్రాన్ కూడా ఇదే విషయం చెప్పాడు. 'ఇదో గొప్ప విజయం. మా ఫ్రాంచైజీ చివరి వరకూ థ్రిల్లింగ్‌గా జరిగే మ్యాచులను మరీ ఎక్కువ ఇష్టపడుతున్నట్లు ఉంది. ఇదేం పర్‌ఫెక్ట్ గేమ్ కాదు కానీ.. గెలవడం సంతోషంగా ఉంది. మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు కూడా చక్కగా ప్రభావం చూపారు. డెత్ ఓవర్లలో అయితే చాలా బాగా బౌలింగ్ చేశారు. అప్పటికే కొంత మంచు వచ్చినా.. పిచ్ నుంచి కొంత సహకారం అందింది' అని చెప్పుకొచ్చాడు.

'మిడిలార్డర్‌లో సికందర్ రజా చాలా బాగా ఆడాడు. ఇక చివర్లో షారుఖ్ ఇచ్చిన ఫినిషింగ్ సూపర్. జట్టులో తన పాత్ర ఏంటో కోచింగ్ స్టాఫ్‌ క్లియర్ కట్‌గా అతనికి చెప్పేశారు. తను కూడా తన రోల్‌ను చక్కగా పోషించేందుకు చాలా కష్టపడ్డాడు. అతను ఇదే ఆటతీరు కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. ప్రతి మ్యాచుకూ ఒక కొత్త ప్లాన్‌తో మేం రావలసి ఉంటుంది. ఈ రిథమ్ ప్రస్తుతం బాగుంది. మేం 6-7 మంది బౌలర్లను ఉపయగించాం. ఇన్ని ఆప్షన్లు ఉండటం కూడా మంచిదే' అని పేర్కొన్నాడు.

Story first published: Sunday, April 16, 2023, 7:17 [IST]
Other articles published on Apr 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+