పంజాబ్‌పై లక్నో భారీ విజయం తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చాలా పేలవమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్‌లోనే వరుసగా రెండు మ్యాచుల్లో తొలి ఓవర్‌ను మెయిడెన్ ఆడాడీ స్టార్ బ్యాటర్. టీ20 ఫార్మాట్‌లో జట్టుకు అవసరమైన ధనాధన్ ఓపెనింగ్ ఇవ్వడంలో విఫలం అవుతూనే ఉన్నాడు.
పంజాబ్‌పై కూడా అతను అలాగే ఆడాడు. మొత్తం 9 బంతులు ఎదుర్కొని 12 పరుగులు మాత్రమే చేశాడు. అవతలి వైపు కైల్ మేయర్స్ విధ్వంసం సృష్టిస్తుంటే తను మాత్రం నిదానంగా ఆడాడు. అయితే కగిసో రబాడ బౌలింగ్‌లో రాహుల్ అవుటవడం ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తొలిసారి టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆయుష్ బదోనీ కూడా రెచ్చిపోయాడు.

అతనికి జతకలిసిన స్టొయినిస్ చెలరేగాడు. చివర్లో నికోలస్ పూరన్ కూడా అద్భుతంగా ఆడాడు. దీంతో లక్నో జట్టు ఏకంగా 257 పరుగులు చేసింది. ఇక్కడే ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో జట్టు మొత్తం 8 మ్యాచులు ఆడింది. వీటిలో నాలుగు మ్యాచుల్లో రాహుల్ 20 కన్నా ఎక్కువ పరుగులు చేశాడు. అయితే ఇలా రాహుల్ ఆడిన ప్రతి మ్యాచులోనూ 150 పరుగులు చేయడానికి కూడా ఆ టీీం కష్టపడింది.
మిగతా నాలుగు మ్యాచుల్లో రాహుల్ కనీసం 20 పరుగులు కూడా చేయలేదు. చాలా త్వరగా పెవిలియన్ చేరాడు. ఇలా జరిగిన ప్రతిసారీ లక్నో జట్టు సులభంగా 180-190 పరుగులు చేసింది. పంజాబ్‌పై ఏకంగా 250+ పరుగులు చేసింది. ఇప్పుడు ఈ లెక్కలు నెట్టింట వైరల్‌గా మారాయి. రాహుల్‌ను త్వరగా అవుట్ చేయడం అంటే లక్నోకు హెల్ప్ చేసినట్లే అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.
రాహుల్ కనీసం 20 పరుగులు కూడా చేయని మ్యాచుల్లో లక్నో జట్టు వరుసగా 127/5 (16 ఓవర్లు), 159/8, 154/7, 128/7 పరుగులు చేసింది. చివరగా గుజరాత్‌తో జరిగిన మ్యాచులో రాహుల్ హాఫ్ సెంచరీ చేసినా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. ఆ సమయంలో రాహుల్ ఆటతీరుపై చాలా మంది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక రాహుల్‌ను ప్రత్యర్థులు త్వరగా అవుట్ చేసినప్పుడు మాత్రం లక్నో జట్టు భారీ స్కోర్లు చేసింది. ఇలా జరిగిన మ్యాచుల్లో వరుసగా 193/6, 205/7, 213/9, 257/5 పరుగులతో ఆకట్టుకుంది. మరో విషయం ఏంటంటే.. రాహుల్ హాఫ్ సెంచరీలు చేసిన రెండు మ్యాచుల్లో లక్నో ఓడింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. రాహుల్‌ను అసలు బ్యాటింగ్‌కే పంపొద్దని అంటున్నారు.