Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsPBKS : ఇదీ మా బ్యాటింగ్ బలం.. విజయంపై కేఎల్ రాహుల్ రియాక్షన్!

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో టీం భారీ స్కోరు చేసింది. ఈ వేదికలో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (12) మినహా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ 200పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో టీం 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఐపీఎల్ హిస్టరీలో ఒక జట్టు 250పైగా స్కోరు చేయడం ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. ఈ భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌ కూడా గట్టిగా పోరాడింది. ఇంత భారీ ఛేజ్‌లో ఆ జట్టుకు శుభారంభం అందించాల్సిన కెప్టెన్ శిఖర్ ధవన్ (1), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (9) విఫలమయ్యారు. మరో యువ ప్లేయర్ అథర్వ టైడే (66) ధనాధన్ షాట్లతో ఆకట్టుకున్నాడు.

KL Rahul LSG

సికందర్ రజా (36), లియామ్ లివింగ్‌స్టోన్ (23), శామ్ కర్రాన్ (21), జితేశ్ శర్మ (24) భారీ షాట్లు ఆడినా కూడా అప్పటికే రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. దీంతో 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆ టీం ఆలౌట్ అయింది. ఈ ఓటమిపై లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. 'టాస్ గెలిచి ఉంటే నేనైనా ఛేజింగే తీసుకునే వాడిని. చివరి మ్యాచ్‌లో ఓడిపోవడం మా టీం మొత్తంపై ఎఫెక్ట్ చూపించింది. కానీ నాలుగైదు రోజులు బ్రేక్ రావడం కలిసొచ్చింది' అని చెప్పాడు.

'ఈ బ్రేక్ దొరకడంతో అందరి మీద నుంచి చివరి మ్యాచ్ ఒత్తిడి పోయింది. లక్నోలో ఆడినప్పుడు అక్కడి వికెట్లు వేరుగా, బ్యాటర్లకు ఛాలెంజింగ్‌గా ఉన్నాయి. కానీ ఇలాంటి పిచ్‌లపై ఆడేటప్పుడు బ్యాటర్లు చాలా ఎగ్జయిట్ అవుతారు. ఇలా 250-260 పరుగులు చేయడం మా బ్యాటింగ్ బలాన్ని చాటి చెప్తాయి. మొదటి రెండు, మూడు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లపై కైల్ బాగా ఒత్తిడ పెంచాడు' అని రాహుల్ వివరించాడు.

'కైల్ బ్యాటింగ్‌ మా ఇన్నింగ్స్‌కు ఒక టోన్ సెట్ చేసింది. అక్కడి నుంచి మేం దాన్ని అలాగే కొనసాగించాం. ఎలాంటి ట్యాక్టిక్స్ ఉపయోగించాలని చాలా ఆలోచించాం. మా వద్ద కైల్, పూరన్, స్టొయినిస్ రూపంలో ముగ్గురు పవర్ హిట్టర్లు ఉన్నారు. వాళ్ల పక్కన మేం అందరం బ్యాటింగ్ చేయొచ్చు. కొన్ని పరిస్థితుల్లో బ్యాటర్లు ఎలా ఆడతారో గమనించి, వారిలో బెస్ట్ ఆటను బయటకు తీసుకురావడానికే మేం ప్రయత్నిస్తాం' అని పేర్కొన్నాడు.

Story first published: Saturday, April 29, 2023, 7:49 [IST]
Other articles published on Apr 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+