Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsPBKS : బిగ్ హిట్టింగ్ ఓపెనర్ రీఎంట్రీ.. లక్నో, పంజాబ్ తలపడే జట్లు ఇవే.. విజయం ఎవరిదో?

ఐపీఎల్‌లో మరో సూపర్ మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడేందుకు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం మంచి జోరు మీదున్న లక్నో.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కొంచెం తడబడిన పంజాబ్ ఐదో స్థానానికి పడిపోయింది. అయితే ఈ వారం అంతా విజిటింగ్ టీమ్స్ ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో.. పంజాబ్ గెలిచే అవకాశం ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ కైల్ మేయర్స్ వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు. దీంతో అతన్ని ఈ మ్యాచ్‌లో పక్కన పెట్టేసే అవకాశం ఉంది. అతని స్థానంలో సఫారీ స్టార్ క్వింటన్ డీకాక్‌ను ఆడిస్తారని తెలుస్తోంది. మార్కస్ స్టొయినిస్, పూరన్ కూడా ఫామ్ అందుకోవడంతో డీకాక్‌ను ఆడించడానికి మరో ఆప్షన్ లేదు. కైల్ మేయర్స్ తొలి రెండు మ్యాచుల్లో రాణించినా.. చివరి రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.

quinton de kock

ఇక పంజాబ్ విషయానికొస్తే.. ఓపెనర్‌గా వస్తున్న కొత్త కుర్రాడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వరుసగా రెండు డక్‌లు మూటగట్టుకున్నాడు. కానీ అతనికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే లియామ్ లివింగ్‌స్టోన్ ఇంకా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో.. సికందర్ రజాను కొనసాగించే అవకాశం ఉంది. భానుక రాజపక్స పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. అలాంటప్పుడు అతన్ని కొనసాగిస్తారా? లేక వేరే వాళ్లకు అవకాశం ఇస్తారా తెలియడం లేదు.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. లక్నో పిచ్‌పై నాథన్ ఎల్లీస్ రాణించే అవకాశం ఉంది. కానీ తమ జట్టులో రబాడ ఉండేలా పంజాబ్ ప్లాన్ చేస్తోంది. అప్పుడు ఎల్లీస్ ఆడటం కుదరదు. మాట్ షార్ట్ కూడా మూడో స్థానంలో రాణించాడు. కాబట్టి అతన్ని తీసేయడం కూడా జరిగేలా లేదు.

దీన్ని బట్టి చూస్తే.. లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ దాదాపుగా పాత జట్టుతోనే బరిలో దిగేలా కనిపిస్తోంది. లక్నో మాత్రం మేయర్స్ స్థానంలో డీకాక్‌తో ఆడే ఛాన్స్ ఉంది. అలాగే పెద్దగా ప్రభావం చూపని జయదేవ్ ఉనద్కత్ స్థానంలో యష్ ఠాకూర్‌ను ఆడించొచ్చు.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు (అంచనా) : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డీకాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, ఆవేష్ ఖాన్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయి

పంజాబ్ కింగ్స్ జట్టు (అంచనా) : ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధవన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, శామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్షదీప్ సింగ్

Story first published: Saturday, April 15, 2023, 13:28 [IST]
Other articles published on Apr 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+