For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSGvsPBKS : పంజాబ్ కొంప ముంచిన స్టార్ ప్లేయర్.. సింపుల్ క్యాచ్‌ను సిక్సర్ పంపాడు!

క్రికెట్‌లో క్యాచులు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఫీల్డర్ల చెయ్యి జారే ఒకే ఒక్క క్యాచ్ ఆ జట్టును ఓడించే ఛాన్స్ ఉంది. అందుకే ఆటగాళ్లు తమ ఫీల్డింగ్‌పై, ముఖ్యంగా క్యాచులు అందుకోవడంపై ప్రత్యేకంగా శ్రద్ధపెట్టి శ్రమిస్తారు. కానీ కొన్నిసార్లు సులభమైన క్యాచులు కూడా పట్టుకోలేక తడబడతారు. అలా ఎవరైనా కుర్ర ప్లేయర్ పొరపాటు చేస్తే సరే. కానీ సీజన్డ్ సీనియర్ ప్లేయర్లు కూడా క్యాచులు వదిలేస్తే ఎలా?

లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు సరైన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ కైల్ మేయర్స్ మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది.

livingstone

అతను కూడా అవుటైన తర్వాత మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. అతను కూడా వచ్చీరాగానే భారీ షాట్లు ఆడటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ కూడా బాదాడు. అయితే అతను అంతకుముందే అవుటవ్వాల్సింది. అతను ఇచ్చిన క్యాచును ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ వదిలేశాడు. వ్యక్తిగత స్కోరు 35 పరుగుల వద్ద ఉన్న స్టొయినిస్ భారీ షాట్ ఆడబోయాడు.

అయితే అతను ఎలా ఆడుతుందీ అర్థం చేసుకున్న బౌలర్ రాహుల్ చాహర్.. తెలివిగా బౌలింగ్ చేశాడు. దీంతో స్టొయినిస్ కొట్టిన భారీ షాట్ అతను అనుకున్నంత బాగా కనెక్ట్ అవ్వలేదు. దీంతో గాల్లోకి లేచిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న లివింగ్‌స్టోన్ సులభంగా పట్టేస్తాడని అంతా అనుకున్నారు. అతను ఆ క్యాచ్ అలాగే అందుకున్నాడు కూడా.

కానీ ఈ క్యాచ్ అందుకునే సమయంలో తను తప్పు చేయడం జరగదనే నమ్మకంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించాడీ స్టార్ ఆల్‌రౌండర్. దీంతో తడబడిన అతని కాలు బౌండరీ లైన్‌ను తాకింది. అప్పటికే పెవిలియన్ బాట పట్టిన స్టొయినిస్.. ఇది చూసి మళ్లీ తిరిగొచ్చాడు. క్యాచ్ వదిలేసింది కాక.. అది సిక్సర్ కూడా అయింది. ఈ జీవనదానం లభించిన తర్వాత స్టొయినిస్ మరింత చెలరేగాడు.

ఇదంత చూసిన పంజాబ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంత ఈజీ క్యాచ్ కూడా పట్టుకోలేవా? అంటూ లివింగ్‌స్టోన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో జట్టుతో చేరినప్పటి నుంచి లివింగ్‌స్టోన్ ఏ విభాగంలోనూ పెద్దగా రాణించని సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ ఫెయిలయ్యాడు. ఇప్పుడు ఫీల్డింగ్‌లో కూడా చేతులెత్తేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Friday, April 28, 2023, 21:07 [IST]
Other articles published on Apr 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+