Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsPBKS : రాహుల్‌ను అవుట్ చేసినందుకే ఇంత భారీ స్కోరు.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన లక్నో బ్యాటర్లు.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో హిస్టరీ సృష్టించారు. ఏకంగా 257 పరుగుల స్కోరు సాధించారు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు. లక్నో ఇన్నింగ్స్ ఆరంభించిన తీరుకు, ముగించిన తీరుకు చాలా తేడా ఉంది.

మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు కేఎల్ రాహుల్ (12) అనుకున్న ఆరంభం ఇవ్వలేకపోయాడు. తొలి ఓవర్లో ఐదు బంతులు ఎదుర్కొన్న అతను ఒకే ఒక పరుగు చేశాడు. ఆ తర్వాత కూడా అతని ఇన్నింగ్స్ వేగం పెరగలేదు. మొత్తం 9 బంతులు ఎదుర్కొన్న అతను 12 పరుగులు చేశాడు. ఇలాంటి సమయంలో కగిసో రబాడ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

KL Rahul Wicket

ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అందరూ పంజాబ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ప్రతి ఒక్కరూ 200పైగా స్ట్రైక్ రేటుతో పరుగులు చేశారు. రాహుల్‌తో పాటు ఓపెనింగ్ చేసిన కైల్ మేయర్స్ (54) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాహుల్ అవుటైన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆయుష్ బదోనీ (43) బరిలో దిగాడు. కొత్తగా మూడో స్థానంలో వచ్చిన అతను కూడా ధనాధన్ ఆటతో ఆకట్టుకున్నాడు.

అతనికి జత కలిసిన మార్కస్ స్టొయినిస్ (40 బంతుల్లో 72) మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు. అతనితోపాటు నికోలస్ పూరన్ (19 బంతుల్లో 45) కూడా అదరగొట్టాడు. ఇలా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ విశ్వరూపం ప్రదర్శించడంతో లక్నో జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో 250 పరుగుల మార్కు దాటిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది.

ఇదంతా చూసిన పంజాబ్ ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు. అసలు కేఎల్ రాహుల్‌ను అవుట్ చేయకపోయి ఉంటే.. లక్నో ఇంత భారీ స్కోరు చేసేది కాదని వాపోతున్నారు. 'రాహుల్‌ను ఎందుకు అవుట్ చేశావురా?' అంటూ రబాడపై జోకులు పేలుస్తున్నారు. రాహుల్ ఉంటే లక్నో జట్టు 150 పరుగుల స్కోరు కూడా దాటేది కాదని అభిప్రాయపడుతున్నారు.

Story first published: Friday, April 28, 2023, 22:31 [IST]
Other articles published on Apr 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+