Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsMI మొహ్‌సిన్ మా మ్యాచ్ విన్నర్: కృనాల్ పాండ్యా

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఆ టీం మిడిలార్డర్‌ ముంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్కస్ స్టొయినిస్ (89 నాటౌట్), కృనాల్ పాండ్యా (49) రాణించడంతో మంచి స్కోరే చేసింది. అయితే ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్ (59), రోహిత్ శర్మ (37) ఇద్దరూ ధాటిగా ఆడారు.

తొలి ఓవర్ నుంచే ఎటాకింగ్ క్రికెట్ ఆడిన ఇషాన్ కిషన్ (59) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అదే సమయంలో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ శర్మ (37) కూడా ఆకట్టుకున్నాడు. వీళ్లిద్దరూ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. వీళ్లిద్దరే ఛేజింగ్ పూర్తి చేసేలా కనిపించారు. అలాంటి సమయంలో బంతి అందుకున్న రవి బిష్ణోయి.. తను వేసిన వరుస ఓవర్లలో ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు.

Krunal Panda is all praise for Mohsin KHan

ఆ తర్వాత ముంబై మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఒక్కరంటే ఒక్కరు కూడా భారీ షాట్లు ఆడలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ (7) అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి, బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. యువ ప్లేయర్ నేహాల్ వధీర (20 బంతుల్లో 16) కీలకమైన సమయంలో మరీ ఎక్కువ డాట్ బాల్స్ ఆడేశాడు. విష్ణు వినోద్ (2) కూడా ఒత్తిడికి తలొగ్గాడు.

దీంతో టిమ్ డేవిడ్ (32 నాటౌట్)పై మరీ ఒత్తిడి పెరిగింది. వీలు చిక్కినప్పుడల్లా అతను భారీ షాట్లు ఆడినా.. అతనికి జతకలిసిన కామెరూన్ గ్రీన్ (6 బంతుల్లో 4 నాటౌట్) విఫలమయ్యాడు. దీంతో ఆ జట్టు ఐదు పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ఓడిపోయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానానికి ఎగబాకింది.

ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా మ్యాచ్ మధ్యలో పలుమార్లు మైదానం వీడాడు. బ్యాటింగ్ సమయంలో పరిగెత్తలేక రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. ఫీల్డింగ్ సమయంలో కూడా కాసేపు మైదానం వీడాల్సి వచ్చింది. దీని గురించి చెప్పిన అతను.. 'నా కాలి కండరాలు పట్టేసినట్లుంది. దీంతో నడవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ జట్టు కోసం మళ్లీ మైదానంలోకి వచ్చా' అని చెప్పాడు.

చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన మొహ్‌సిన్ ఖాన్‌ను కూడా మెచ్చుకున్నాడు. 'గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మొహ్‌సిన్ చాలా పెద్ద మనసున్న బౌలర్. అలాంటి వాళ్లు చాలా ఎత్తుకు ఎదుగుతారు. గతేడాది కాలంగా గాయంతో ఉన్నాడతను. పెద్ద సర్జరీ కూడా జరిగింది. కానీ అద్భుతంగా ఆడాడు.' అని కొనియాడాడు.

'అతని మనసు చాలా పెద్దది. తనకు ఆకాశమే హద్దు. మాకు ఈ సీజన్ అంత గొప్పగా జరగలేదు. మేం మంచి క్రికెట్ ఆడాం. కానీ కొన్ని మ్యాచుల్లో ఫలితాలు మాత్రం మాకు అనుకూలంగా రాలేదు. ఫ్యాన్స్ మాకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వాళ్లకు ఈ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, May 17, 2023, 7:05 [IST]
Other articles published on May 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+