ఐపీఎల్‌ను ఎప్పుడూ నిదానంగా ప్రారంభించి, ఆ తర్వాత సడెన్‌గా జోరు పెంచడం ముంబై ఇండియన్స్‌కు బాగా అలవాటు. అందుకే ఆ టీంను అందరూ 'లేట్ బ్లూమర్స్' అని పిలుస్తుంటారు. ఈ ఏడాది కూడా ముంబై ఈ పేరు తమకు కరెక్టే అని నిరూపించుకుంది. సీజన్ తొలి ఫేజ్‌లో చాలా పేలవ ప్రదర్శన చేసింది.
కానీ సగం నుంచి వరుస విజయాలతో టాప్-4లోకి దూసుకొచ్చింది. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరుకుంది. దానికితోడు టాప్-2లో ఏదో ఒక స్థానాన్ని గ్యారంటీ చేసుకుంది. ఈ క్రమంలో ముంబై ముందు కూడా మంచి అవకాశం ఉంది. మిగతా జట్లలో ఎవరికీ 18 పాయింట్లు సంపాదించ ఛాన్స్ లేదు.

ఆ అవకాశం ముంబై ముందే ఉంది. ఈ నేపథ్యంలోనే లక్నో కూడా ప్లేఆఫ్స్ బెర్తు కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ రెండు జట్లు ఏకానా స్టేడియం వేదికగా తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండయా మాజీ లెజెండ్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టు తమ టీంపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డాడు.
ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతన్ని పర్మినెంట్‌గా మూడో స్థానానికి సెట్ చేసేయాలని సెహ్వాగ్ సూచించాడు. అయితే ఈ నిర్ణయం మాత్రం ముంబై యాజమాన్యమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.
'స్కైని మూడో నెంబర్‌లో పర్మినెంట్ చేసేస్తే మంచిది. తను మంచి బ్యాటర్. పేస్, స్పిన్ రెంటినీ చక్కగా ఆడగలడు. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది టీం మేనేజ్‌మెంటే. కానీ అతను ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే అంత మంచిదని నా అభిప్రాయం' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
అయితే లక్నో పిచ్ బౌలర్లకు మంచి సహకారం అందిస్తుంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన మ్యాచులన్నీ లో-స్కోరింగ్ మ్యాచులే. ఇక్కడ వచ్చీరాగానే భారీ షాట్లు ఆడటం కుదరదు. క్రీజులో కుదురుకున్న తర్వాతే ఎవరైనా మంచి షాట్లు ఆడగలుగుతారు. ఇలాంటి పిచ్‌పై సూర్య ఎలా ఆడతాడో చూడాలి.