Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsMI : మ్యాచ్ ఎక్కడ చెయ్యి జారిందో తెలియడం లేదు: రోహిత్ శర్మ

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఆ టీం మిడిలార్డర్‌ ముంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్కస్ స్టొయినిస్ (89 నాటౌట్), కృనాల్ పాండ్యా (49) రాణించడంతో మంచి స్కోరే చేసింది. అయితే ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్ (59), రోహిత్ శర్మ (37) ఇద్దరూ ధాటిగా ఆడారు.

తొలి ఓవర్ నుంచే ఎటాకింగ్ క్రికెట్ ఆడిన ఇషాన్ కిషన్ (59) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అదే సమయంలో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ శర్మ (37) కూడా ఆకట్టుకున్నాడు. వీళ్లిద్దరూ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. వీళ్లిద్దరే ఛేజింగ్ పూర్తి చేసేలా కనిపించారు. అలాంటి సమయంలో బంతి అందుకున్న రవి బిష్ణోయి.. తను వేసిన వరుస ఓవర్లలో ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు.

Rohit Sharma Mumbai Indians

ఆ తర్వాత ముంబై మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఒక్కరంటే ఒక్కరు కూడా భారీ షాట్లు ఆడలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ (7) అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి, బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. యువ ప్లేయర్ నేహాల్ వధీర (20 బంతుల్లో 16) కీలకమైన సమయంలో మరీ ఎక్కువ డాట్ బాల్స్ ఆడేశాడు. విష్ణు వినోద్ (2) కూడా ఒత్తిడికి తలొగ్గాడు.

దీంతో టిమ్ డేవిడ్ (32 నాటౌట్)పై మరీ ఒత్తిడి పెరిగింది. వీలు చిక్కినప్పుడల్లా అతను భారీ షాట్లు ఆడినా.. అతనికి జతకలిసిన కామెరూన్ గ్రీన్ (6 బంతుల్లో 4 నాటౌట్) విఫలమయ్యాడు. దీంతో ఆ జట్టు ఐదు పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ఓడిపోయింది. ఈ ఓటమి గురించి ముంబై సారధి రోహిత్ శర్మ స్పందించాడు.

మ్యాచ్ ఎక్కడ చేజారిందని ప్రశ్నించగా.. దానికి తన వద్ద సమాధానం లేదని రోహిత్ అన్నాడు. 'మేం ఈ మ్యాచ్ ఓడిపోయాం అంతే. గెలిచేంత గొప్పగా మేం ఆడలేదని అనుకుంటున్నా. కొన్ని సందర్భాల్లో మేం రాణించలేదు. ఇది బాధాకరమే కానీ.. తలెత్తుకొని ఉండాల్సిన తరుణం' అని చెప్పాడు.

అలాగే ముంబైకి ధనాధన్ ఓపెనింగ్ అందించడం గురించి కూడా మాట్లాడాడు. 'మేం పిచ్‌ను త్వరగా అంచనా వేయగలిగాం. దాంతో వేగంగా ఆడటం సాధ్యమైంది. ఇంతకుముందు పిచ్ వంటిది కాదిది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం సులువుగా ఉంది. కానీ సెకండ్ హాఫ్‌లో మేం దారి తప్పాం. అదే సమయంలో లక్నో ఇన్నింగ్స్ రెండో సగంలో మరీ ఎక్కువ పరుగులు ఇచ్చేశాం' అని అభిప్రాయపడ్డాడు.

'మేం వేసిన చివరి మూడు ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చేశాం. అయినా సరే మాకు దక్కిన ఆరంభంతో మ్యాచ్ మా చేతుల్లోనే ఉన్నట్లు అనిపించింది. ఛేజ్ చేసేస్తామని అనుకున్నాం. స్టొయినిస్ తన బలాన్ని నమ్ముకొని ఆడాడు. ఎక్కువగా డౌన్ ది గ్రౌండ్ షాట్స్ ఆడాడు. ఈ పిచ్‌పై అదే చేయాలి. ఇక ప్లేఆఫ్స్ లెక్కలు ఎలా ఉంటాయో నాకు తెలీదు. మా పని ఆడిన మ్యాచులు గెలవడమే' అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, May 17, 2023, 0:03 [IST]
Other articles published on May 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+