Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsMI : లక్నోకు లక్కీగా మారిన బిష్ణోయి.. ఏం బౌలింగ్‌రా అది!

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న కీలకమైన పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌కు యువ స్పిన్నర్ రవి బిష్ణోయి లక్కీగా మారాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్కస్ స్టొయినిస్ (89 నాటౌట్), కృనాల్ పాండ్యా (49) రాణించడంతో మంచి స్కోరే చేసింది. అయితే ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఇద్దరూ ధాటిగా ఆడారు.

తొలి ఓవర్ నుంచే ఎటాకింగ్ క్రికెట్ ఆడిన ఇషాన్ కిషన్ (59) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అదే సమయంలో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ శర్మ (37) కూడా ఆకట్టుకున్నాడు. వీళ్లిద్దరూ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. వీళ్లిద్దరే ఛేజింగ్ పూర్తి చేసేలా కనిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు కృనాల్ పాండ్యా ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది.

LSG young spinner Ravi Bishnoi

ఇలాంటి సమయంలో 10వ ఓవర్లో మొదటి ఓవర్ వేయడానికి వచ్చిన బిష్ణోయి సూపర్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి ఫామ్‌లో కనిపించిన రోహిత్ శర్మను అవుట్ చేశాడు. బిష్ణోయి వేసిన బంతికి భారీ షాట్ ఆడబోయిన రోహిత్.. షాట్‌ను సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో దీపక్ హుడా అందుకున్న చక్కని క్యాచ్‌కు రోహిత్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

ఆ తర్వాత మళ్లీ 12వ ఓవర్లో బంతి అందుకున్న బిష్ణోయి.. ఆ ఓవర్లో కూడా అదరగొట్టాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసి దుమ్మురేపుతున్న ఇషాన్ కిషన్‌ను బుట్టలో వేసుకున్నాడు. అతను కూడా బిష్ణోయి వేసిన బంతికి భారీ షాట్ ఆడబోయాడు. కానీ అది కూడా సరిగా కనెక్ట్ కాకపోవడంతో నవీన్ ఉల్ హక్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చాడు. దీంతో ముంబై జట్టు క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు ఇద్దరి వికెట్లనూ కోల్పోయింది.

అయితే అప్పటికే లక్నోకు చాలా డ్యామేజీ జరిగిపోయింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అయితే.. ఇషాన్, రోహిత్ ఇద్దరికీ బిష్ణోయి బౌలింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. 'అసలు ఏం బౌలింగ్‌రా అది? అంత తెలివిగా ఎలా బౌలింగ్ చేస్తున్నావ్?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో లక్నోకు బిష్ణోయి అద‌ష్టంగా మారాడని మెచ్చుకుంటున్నారు.

Story first published: Tuesday, May 16, 2023, 22:58 [IST]
Other articles published on May 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+