Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsMI : రోహిత్‌ను కౌగిలించుకున్న గంభీర్.. వీడియో షేర్ చేసిన లక్నో టీం!

ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ రేసు చాలా ఆసక్తికరంగా మారింది. ఈ రేసును మరింత ఆసక్తిగా మార్చే మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్ ముఖ్యంగా లక్నోకు చాలా కీలకంగా మారింది.

ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టు లక్నో చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో భాగంగా ముంబై సారధి రోహిత్ శర్మ స్టేడియానికి వచ్చాడు. ఇక్కడ లక్నో టీం గ్లోబల్ మెంటార్, టీమిండియా మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్‌ను రోహిత్ కలిశాడు. ఈ సందర్భంగా రోహిత్‌ను కౌగిలించుకున్న గంభీర్ నవ్వుతూ మాట్లాడాడు.

 Gautam Gambhir hugs Rohit Sharma

దీనికి సంబంధించి వీడియోను లక్నో టీం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీనికి 'వెల్‌కం టు లక్నో, రోహిత్' అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో ఉన్న ముంబై.. ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న ముంబై.. మిగతా రెండు మ్యాచుల్లో కూడా గెలవాలని అనుకుంటోంది.

అదే జరిగితే ముంబై కూడా గుజరాత్‌లాగే 18 పాయింట్లతో తొలి క్వాలిఫైయర్ ఆడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడి నుంచి ఆడే మ్యాచులు లక్నోకు చాలా ముఖ్యం కానున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో చివరి మూడు స్థానాల కోసం గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో.. లక్నోకు విజయం చాలా ముఖ్యం. లేదంటే ఈ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సి రావొచ్చు కూడా.

మరి బౌలింగ్‌కు పూర్తిగా సహకరించే ఏకానా స్టేడియంలో ముంబై బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇప్పటి వరకు ముంబై గెలిచిన మ్యాచుల్లో ఎక్కువ భాగం ఛేజింగ్‌లో గెలిచినవే కావడం గమనార్హం. అయితే ఏకానా స్టేడియంలో ఛేజింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మరి ఈ మ్యాచ్‌లో ముంబై ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Story first published: Tuesday, May 16, 2023, 18:46 [IST]
Other articles published on May 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+