Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsDC : ఆ బౌలింగ్ ఏంట్రా?.. వుడ్ సూపర్ బౌలింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

ఐపీఎల్ 16వ సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ భారీ విజయంతో ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో అదరగొట్టింది. దీంతో ఏ దశలోనూ ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ముఖ్యంగా లక్నో పేసర్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ మాక్క్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఢిల్లీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.

గాయం వల్ల ఇంగ్లండ్ జట్టుకు దూరమైన మార్క్ వుడ్.. ఈ మ్యాచ్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. మ్యాచ్ ఆరంభం నుంచి సరైన్ లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడంతోపాటు అద్భుతమైన స్వింగ్, పేస్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. తన ఫామ్‌ను చక్కగా ఉపయోగించుకున్న మార్క్ వుడ్.. ఢిల్లీపై ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇలా బంతితో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఐదేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతున్న అతను అదరగొట్టాడు.

mark wood bowling 22

ఈ మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న మార్క్ వుడ్.. ఒకే ఓవర్లో స్టార్ ఓపెనర్ పృథ్వీ షా, ఆస్ట్రేలియన్ స్టార్ మిచెల్ మార్ష్ ఇద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. ఆ తర్వాత కూడా వుడ్ సూపర్ బౌలింగ్ ఆగలేదు. ఆ తర్వాత కాసేపటికే సూపర్ బౌన్సర్‌తో సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా అవుట్ చేశాడు. ఇలా ఢిల్లీ బ్యాటింగ్ వెన్నెముకను విరిచిన అతను.. చివరి ఓవర్లో కూడా ఇద్దరు టెయిలెండర్లను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఈ సీజన్‌లో తొలిసారి ఐదు వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు.

ఇలా మార్క్ వుడ్ రెచ్చిపోవడం చూసిన అభిమానులు కూడా మౌనంగా ఉండలేకపోయారు. వుడ్ బౌలింగ్ విన్యాసాలను తెగ మెచ్చుకుంటున్నారు. అలాగే ఢిల్లీ బ్యాటర్ల వైఫల్యాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వుడ్ వేసే బంతులు కనిపించడం లేదా? అంటూ ఢిల్లీ బ్యాటర్లను ట్రోల్ చేస్తున్నారు. తను వేసిన మొదటి ఓవర్లోనే రెండు బంతులతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడని వుడ్‌ను కొందరు మెచ్చుకుంటుంటే.. వుడ్ బౌలింగ్‌కు ఢిల్లీ బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయిందని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Sunday, April 2, 2023, 8:43 [IST]
Other articles published on Apr 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+