LSG vs RR : అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నాం.. రెండు మార్పులతో రాజస్థాన్, ఒక్క మార్పుతో లక్నో బరిలోకి

ఐపీఎల్ 2022 సీజన్ కీలక దశకు చేరుకుంది. నేడు డబుల్ హెడర్‌లో భాగంగా రాత్రి 7.30గంటలకు ముంబైలోని బ్రాబోర్న్ మైదానం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే 16పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌కు చేరువలో ఉన్న లక్నో ఈ మ్యాచ్ గెలిచి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లేఆఫ్ బెర్త్ దక్కించుకోవాలని చూస్తుండగా.. మరోవైపు 14 పాయింట్స్‌తో ఉన్నా రాజస్థాన్ కూడా ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో మిగతా జట్లతో సమస్య లేకుండా చేసుకోవాలని చూస్తోంది.
16పాయింట్లు ఉన్న జట్లు దాదాపుగా ప్లేఆఫ్ చేరే అవకాశమున్న తరుణంలో లక్నో దాదాపు ప్లేఆఫ్ చేరుకోవడానికి వీలవుతుంది. కానీ రాజస్థాన్ మాత్రం ఒక్క మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిన అవసరముంది. 16పాయింట్లు ఉన్నా నెట్ రన్ రేట్, మిగతా జట్ల జయాపజయాలు కూడా కాస్త ప్రభావం చూపే వీలుంది.

బ్యాటింగే మా బలమన్న సంజూ శాంసన్
ఈ క్రమంలో లక్నో వర్సెస్ రాజస్థాన్ జట్ల కెప్టెన్లు కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ టాస్ కోసం గ్రౌండ్లోకి రాగా.. టాస్ గెలిచిన సంజూ శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్ మాట్లాడుతూ.. మేము ముందుగా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నాం.
మాకు బ్యాటింగే బలం. అందుకే ఈ పిచ్ మీద తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేయాలనుకుంటున్నాం. మా జట్టులో రెండు మార్పులు చేశాం. రాస్సీ వండర్ డుస్సెస్, కుల్దీప్ సేన్‌ల స్థానంలో జిమ్మీ నీషమ్, ఒబెడ్ మెక్‌కాయ్ జట్టులో చేరారు. గత మ్యాచ్‌లో ఓటమిని మర్చిపోయి ఈ మ్యాచ్‌లో రాణించాలనే మానసిక స్థితిలో ఉన్నాం. అని సంజూ పేర్కొన్నాడు.

నేను అనుకున్నట్లే జరిగింది
టాస్ ఓడిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. నేను టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాను. లక్కీగా అదే జరిగింది. పిచ్ చక్కటి వికెట్‌లా కనిపిస్తోంది. తప్పకుండా దీన్ని మేము ఉపయోగించుకుంటాం. గత మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మేం పాఠంగా తీసుకున్నాం. మేము ఆ మ్యాచ్ మీద బాగా డిస్కస్ చేశాం. అలాంటి గేమ్ ఎప్పుడైనా ఒకటి ఓ జట్టు ఎదుర్కోవచ్చని తెలుసుకున్నాం. ఇక ఈ మ్యాచ్‌లో మాత్రం మా తప్పులను సరిదిద్దుకుని రాణిస్తాం. ఇక ఈ మ్యాచ కోసం కరణ్ శర్మను తప్పించాం. అతని స్థానంలో రవి బిష్ణోయ్ తిరిగి జట్టులో చేరాడని రాహుల్ పేర్కొన్నాడు.

తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్‌కాయ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications