Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs RR : లక్నో ముందు టఫ్ టార్గెట్ ఉంచిన రాజస్థాన్

score 178

ఐపీఎల్ 2022 సీజన్ కీలక దశకు చేరుకుంది. నేడు డబుల్ హెడర్‌లో భాగంగా రాత్రి 7.30గంటలకు ముంబైలోని బ్రాబోర్న్ మైదానం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఇప్పటికే 16పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌కు చేరువలో ఉన్న లక్నో ఈ మ్యాచ్ గెలిచి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లేఆఫ్ బెర్త్ దక్కించుకోవాలని చూస్తుండగా.. మరోవైపు 14 పాయింట్స్‌తో ఉన్నా రాజస్థాన్ కూడా ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో మిగతా జట్లతో సమస్య లేకుండా చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన సంజూ శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (41పరుగులు 29బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సర్), కెప్టెన్ సంజూ శాంసన్ (32పరుగులు 24బంతుల్లో 6ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (39పరుగులు 18బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20ఓవర్లకు రాజస్థాన్ 6వికెట్లు కోల్పోయి 178పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 8మందితో బౌలింగ్ చేయించడం గమనార్హం. వీరిలో రవి బిష్ణోయ్ 4ఓవర్లలో 31పరుగులు చేసి 2 వికెట్లు తీయగా.. హోల్డర్ 1, ఆయుష్ బదోని 1, ఆవేష్ ఖాన్ 1 వికెట్ తీశారు.

తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్‌కాయ్

Story first published: Sunday, May 15, 2022, 21:59 [IST]
Other articles published on May 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+