For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs RR : లక్నోపై ఘన విజయం సాధించి ప్లేఆఫ్ రేసులో స్లాట్ బుక్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్..!

rr win

ఐపీఎల్ 2022 సీజన్ కీలక దశకు చేరుకుంది. నేడు డబుల్ హెడర్‌లో భాగంగా ముంబైలోని బ్రాబోర్న్ మైదానం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 24పరుగుల తేడాతో లక్నోపై గెలుపొందింది. లక్నో బ్యాటర్లో దీపక్ హుడా (59పరుగులు 39బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) పోరాటం చేసినా అది సరిపోలేదు. మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోవడంతో ఆర్ఆర్ చేతిలో లక్నో ఓటమి పాలయింది. దీంతో ఆ జట్లు ప్లేఆఫ్ బెర్త్ ఇంకా కన్ఫం కాలేదు. మరో వైపు 8విజయాలతో ఆర్ఆర్ ప్లేఆఫ్ రేసులో దాదాపు బెర్త్ ఖాయం చేసుకున్నట్లే.. ఇక ఆ జట్టు తన చివరి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయి.. లక్నోతో సహా మిగిలిన అవకాశాలున్న జట్లు భారీ విజయాలతో గెలిస్తే తప్పా ఆ జట్లు ప్లేఆఫ్ బెర్త్ గల్లంతు కాదు. ఇక ఆర్ఆర్ నెట్‌రన్‌రేట్ కూడా పాజిటివ్‌గా ఉండడం కూడా ఆ జట్టుకు కలిసొస్తుంది. ఇకపోతే సేమ్ పాయింట్లతో (16)తో ఉన్నప్పటికీ లక్నో(3వ స్థానం) కంటే ఒక స్థానం మెరుగ్గా 2వ స్థానంలో రాజస్థాన్ ఉంది. ఇక పాయింట్ల టేబుల్లో టాప్ 1గా గుజరాత్ ఉంది.

ఆరంభంలోనే లక్నోకు ఎదురుదెబ్బ
ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్లో ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ వేయగా.. ఆ ఓవర్ తొలి బంతికి డికాక్ (7పరుగులు 8 బంతుల్లో) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక ఆ ఓవర్ రెండో బంతికి యువ ప్లేయర్ ఆయుష్ బదోని (0) డకౌట్ అయ్యాడు. బోల్ట్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఆయుష్ బదోని ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యి పెవిలియన్ బాటపట్టాడు. ఇక కెప్టెన్ రాహుల్ ఉన్నాడన్న ధీమా కూడా ఎంతోసేపు నిలవలేదు. రాహుల్ (10పరుగులు 19బంతుల్లో) తడబడుతూ ఆడుతుండగా.. ప్రసీద్ క్రిష్ణ వేసిన ఆరోఓవర్లో మూడో బంతికి రాహుల్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 29పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి లక్నో కష్టాల్లో పడింది.

ఆదుకున్న వారిద్దరు
కష్టాల్లో పడ్డ లక్నో టీంను కె.పాండ్యా, దీపక్ హుడా ఆదుకున్నారు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు బాదుతూ రన్ రేట్ మరీ ఎక్కువ పడిపోకుండా చూశారు. ఇద్దరు కలిసి 13ఓవర్లు ముగిసేసరికి 94పరుగులకు స్కోరు బోర్డును చేర్చారు. వీరిద్దరి 65పరుగుల భాగస్వామ్యానికి 14వ ఓవర్లో అశ్విన్ బ్రేక్ వేశాడు. కె.పాండ్యా (25పరుగులు 23బంతుల్లో)ను ఔట్ చేశాడు. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మార్కస్ స్టాయినిస్‌తో కలిసి దీపక్ హుడా పోరాటాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న హుడా.. తర్వాత కాస్త ధాటిగా ఆడడం మొదలెట్టాడు.

ఆ సిచువేషన్ విజయావకాశాలను దెబ్బతీసింది
చివరి 4ఓవర్లలో 63పరుగులు చేయాల్సిన తరుణంలో 16వ ఓవర్ చివరి బంతికి చాహల్ అద్భుతం చేశాడు. తన టెక్నిక్ బంతితో దీపక్ హుడాను స్టంప్ అవుట్‌గా బోల్తా కొట్టించాడు. ఇక తర్వాత 17వ ఓవర్ బౌలింగ్ అందుకున్న ఒబెడ్ మెక్ కాయ్.. లక్నో విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. హోల్డర్ (1), చమీరా(0)ను పెవిలియన్‌కు పంపించి మ్యాచ్ టర్న్ చేశాడు. చివరి 2ఓవర్లలో 48పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొనగా.. స్టాయినిస్ (27పరుగులు 17బంతుల్లో) లాంటి హిట్టర్ క్రీజులో ఉండి హిట్టింగ్ చేయాలని చూడగా.. అతను ప్రసీద్ వేసిన చివరి ఓవర్లో తుస్సుమన్నాడు. దీంతో లక్నో పరాజయం ఖాయమైంది. ఇక చివరికి 24పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ విజయంలో ఆర్ఆర్ పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానానికి చేరుకుంది.

అంతకుముందు రాణించిన రాయల్స్
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సంజూ శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (41పరుగులు 29బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సర్), కెప్టెన్ సంజూ శాంసన్ (32పరుగులు 24బంతుల్లో 6ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (39పరుగులు 18బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20ఓవర్లకు రాజస్థాన్ 6వికెట్లు కోల్పోయి 178పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 8మందితో బౌలింగ్ చేయించి కొత్త ప్రయోగం చేశాడు. వీరిలో రవి బిష్ణోయ్ 4ఓవర్లలో 31పరుగులు ఇచ్చి 2వికెట్లు తీయగా.. హోల్డర్ 1, ఆయుష్ బదోని 1, ఆవేష్ ఖాన్ 1 వికెట్ తీశారు.

IPL 2022: LSG vs KKR; Krishnamachari Srikkanth's opinion on match | Expert View | Oneindia news

తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్‌కాయ్

Story first published: Sunday, May 15, 2022, 23:44 [IST]
Other articles published on May 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+