Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదృష్టం అంటే కోహ్లీదే: తొలి ఓవర్లోనే లక్నో ఘోర తప్పిదం!

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బెంగళూరులోన చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో లక్నోకు ఇది మూడో ఓటమి. అయితే మ్యాచ్ ఫలితం ఇలా ఉండటానికి ప్రధాన కారణం లక్నో జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే చేసిన ఓ భారీ తప్పిదమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. కేవలం 15.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

షమీ ఓవర్లో మిస్సైన గోల్డెన్ ఛాన్స్
ఆర్సీబీ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ను లక్నో స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతికి లక్నోకు ఓ అద్భుతమైన రనౌట్ అవకాశం లభించింది. క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్డ్ ఇద్దరూ గందరగోళానికి గురై పిచ్ మధ్యలోకి వచ్చారు. ఆ సమయంలో పాయింట్ వద్ద ఉన్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ హిమ్మత్ సింగ్ బంతిని సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. ఒకవేళ అతను బంతిని పట్టుకుని వికెట్లకు విసిరి ఉంటే.. విరాట్ కోహ్లీ లేదా ఫిల్ సాల్ట్ ఖచ్చితంగా పెవిలియన్ చేరేవారు.

LSG vs RCB IPL 2026 The Run-Out Blunder That Cost Lucknow the Match Against RCB Full Details

విరాట్ కోహ్లీ బీస్ట్ మోడ్.. వార్ వన్ సైడ్
ఈ లైఫ్ లభించిన సమయంలో విరాట్ కోహ్లీ ఇంకా ఖాతా కూడా తెరవలేదు. ఆ రనౌట్ నుంచి తప్పించుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కసారిగా గేర్ మార్చి బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. పవర్ ప్లేను అద్భుతంగా వాడుకుంటూ 34 బంతుల్లో 49 పరుగులు సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరోవైపు ఫిల్ సాల్ట్ తర్వాతి ఓవర్‌లోనే 7 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. కోహ్లీ క్రీజులో ఉండటంతో ఆర్సీబీపై ఒత్తిడి పడలేదు.

ఒక్క వికెట్ పడి ఉంటే కథ వేరేలా..
మ్యాచ్ చివరలో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయిన తీరును చూస్తే.. ఒకవేళ మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ ఔట్ అయి ఉంటే లక్నోకు గెలిచే అవకాశాలు మెండుగా ఉండేవి. విరాట్ కోహ్లీ చేసిన ఆ 49 పరుగులు ఆర్సీబీ స్కోరు బోర్డు నుంచి తీసేస్తే.. 147 పరుగుల ఛేజింగ్ బెంగళూరుకు హిమాలయ పర్వతాన్ని ఎక్కినంత కష్టమయ్యేది. లక్నో చేసిన ఆ ఒక్క ఫీల్డింగ్ తప్పిదం చివరకు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.

Story first published: Thursday, April 16, 2026, 7:45 [IST]
Other articles published on Apr 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+