LSG vs RCB: మలుపు తిప్పిన హర్షల్ పటేల్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన లక్నో! టైటిల్ దిశగా ఆర్‌సీబీ

కోల్‌కతా: ఐపీఎల్ 2022 టైటిల్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రెండు అడుగుల దూరంలో నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 14 పరుగులతో గెలుపొందింది. హర్షల్ పటేల్ సూపర్ బౌలింగ్‌తో ఆర్‌సీబీ భారీ లక్ష్యాన్ని కాపాడుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది. లక్నో చెత్త ఫీల్డింగ్ ఆర్‌సీబీకి కలిసొచ్చింది. కేజీఎఫ్(కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) విఫలమైనా.. రజత్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆర్‌సీబీకి ఊపిరి అయింది.

రాహుల్ వికెట్ టర్నింగ్...

రాహుల్ వికెట్ టర్నింగ్...

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్( 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79), దీపక్ హుడా(26 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 45) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. హర్షల్ పటేల్, హజెల్ వుడ్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు. 19వ ఓవర్‌లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాలను ఔట్ చేసి హజెల్ వుడ్ మ్యాచ్ మూమెంటమ్ మార్చేసాడు. ఈ విజయంతో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న ఎలిమినేటర్ 2లో ఆర్‌సీబీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

డికాక్ విఫలం..

డికాక్ విఫలం..

208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభారంభం దక్కలేదు. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే క్వింటన్ డికాక్(6) క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన మనన్ వోహ్రాతో కలిసి కెప్టెన్ కేఎల్ రాహుల్ ధాటిగా ఆడాడు. బౌండరీలతో జోరు కనబర్చిన వోహ్రాకు హేజల్ వుడ్ చెక్ పెట్టాడు. సూపర్ బాల్‌తో క్యాచ్ ఔట్‌గాపెవిలియన్ చేర్చాడు. సిరాజ్ వేసిన 6వ ఓవర్‌లో రాహుల్ రెండు సిక్స్‌లు, ఫోర్ బాదడంతో పవర్ ప్లేలో లక్నో 2 వికెట్లకు 62 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఈ జోడీ అదే జోరును కనబర్చింది. అయితే హసరంగా, హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది.

చెలరేగిన రాహుల్..

చెలరేగిన రాహుల్..

అయితే హర్షల్ పటేల్ బౌలింగ్‌లో హుడా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను హసరంగా వదిలేశాడు. కానీ సూపర్ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను సింగిల్‌గా మలిచాడు. హజెల్ వుడ్ వేసిన 14వ ఓవర్‌లో రాహుల్ సిక్స్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే హసరంగా వేసిన మరుసటి ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన దీపక్ హుడా.. ఆ వెంటనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన స్టోయినీస్ మరో సిక్సర్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి.

గెలిపించిన హర్షల్ పటేల్

గెలిపించిన హర్షల్ పటేల్

హసరంగా వేసిన 17వ ఓవర్‌లో 14 పరుగులు రావడంతో.. లక్నో విజయానికి 18 బంతుల్లో 41 పరుగులు అవసరమయ్యాయి. 18వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్.. 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసాడు. 19వ ఓవర్‌లో హజెల్ వుడ్ 9 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసాడు. దాంతో చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 24 పరుగులు అవసరమవ్వగా.. హర్షల్ పటేల్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి అద్భుత విజయాన్నందించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, May 26, 2022, 0:34 [IST]
Other articles published on May 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X