
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి లక్నోసూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఈ మ్యాచ్ రాహుల్‌కు 100వది. దీంతో 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆరంభం నుంచి చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రాహుల్ చివరి వరకు ఆడి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 9 ఫోర్లు, 5 సిక్సులతో 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 60 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నిజానికి ఈ మ్యచ్ మందు వరకు ఈ సీజన్‌లో రాహుల్ సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. తాజాగా సెంచరీతో సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇది మూడో సెంచరీ కాగా.. కెప్టెన్‌గా రెండోది. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. 5 సెంచరీలతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. సంజూ శాంసన్ కూడా 3 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘనమైన రికార్డులున్న కేఎల్ రాహుల్ ఈ సెంచరీతో ఆ రికార్డులను మరింత మెరుగుపరచుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 76 సగటుతో 764 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 132గా ఉంది. ఇందులో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 103 పరుగులు నాటౌట్‌గా ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 100 మ్యాచ్‌లాడన కేఎల్ రాహుల్ 47 సగటుతో 3508 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 132 పరుగులుగా ఉంది.
ఇక ఈ మ్యాచ్‌లో రాహుల్ సూపర్ సెంచరీతో లక్నోసూపర్ జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాహుల్ 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగతావారిలో మనీష్ పాండే 38, క్వింటన్ డికాక్ 24, దీపక్ హుడా 15, స్టోయినీస్ 10 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 2, ఎం. అశ్విన్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ తీశారు.