
సెంచరీతో చెలరేగిన రాహుల్
కేఎల్ రాహుల్ తన వందో ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోసూపర్ జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొత్తంగా 9 ఫోర్లు, 6 సిక్సులతో 60 బంతుల్లో 103 పరుగులు చేసిన రాహుల్ నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ఐపీఎల్‌లో వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మిగతా వారిలో మనీష్ పాండే 38, క్వింటన్ డికాక్ 24, స్టోయినీస్ 10, దీపక్ హుడా 15*, కృనాల్ పాండ్యా 1* పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు, ఎం. అశ్విన్, ఫాబిన్ అలెన్ తలో వికెట్ తీశారు.

రోహిత్ శర్మ మళ్లీ విఫలం
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో 6 పరుగులు మాత్రమే చేసి వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ముంబై 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇక తొలి బంతినే ఫోర్ కొట్టిన డేవాల్డ్ బ్రెవిస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఆవేష్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి దీపక్ హుడాకు దొరికిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్సుతో 31 పరుగులు చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(13)ను మార్కస్ స్టోయినీస్ బౌల్డ్ చేశాడు. దీంతో 6.2 ఓవర్లలో ముంబై 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న సూర్య, తిలక్
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ను సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకున్నారు. వీరిద్దరు నాల్గో వికెట్‌కు 48 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 121 పరుగుల వద్ద ఉండగా.. తిలక్ వర్మ(26 బంతుల్లో 26 రన్స్, 2 ఫోర్లు)ను 15వ ఓవర్లో హోల్డర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ముంబై నాల్గో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే అంటే 16వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ (27 బంతుల్లో 37 రన్స్, 3 ఫోర్లు)ను రవి బిష్ణోయ్ ఫెమిలియన్ పంపాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్.. గౌతమ్‌కు క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 127 పరుగులకు ముంబై 5 వికెట్లు కోల్పోయింది.

చివరి 2 ఓవర్లలో విజయానికి 43 పరుగులు
ఈ క్రమంలో ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డు ఆరో వికెట్‌కు 26 పరుగులు జోడించారు. జట్టు స్కోర్ 153 పరుగుల వద్ద ఉండగా.. ఫాబియన్ అలెన్(8)ను ఆవేష్ ఖాన్ ఫెమిలియన్ పంపాడు. ఇక చివరి 2 ఓవర్లలో ముంబై విజయానికి 43 పరుగులు కావాల్సిన సమయంలో జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్ వరుసగా 6, 4 బాదాడు. ఆ వెంటనే లెగ్‌బైస్‌లో ఫోర్ వచ్చింది. దీంతో 19వ ఓవర్లో ముంబైకి 17 పరుగులు వచ్చాయి.

లక్నో విజయం.. ముంబైకి ఆరో పరాజయం
ఇక చివరి ఓవర్లో ముంబై విజయానికి 26 పరుగులు అవసరం అయ్యాయి. చివర్లో కీరన్ పొలార్డ్ క్రీజులో ఉండడంతో ఏమైనా అద్భుతం జరుగుతుందేమోనని ముంబై అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. చమీర వేసిన చివరి ఓవర్ తొలి బంతికే ఉనద్కత్(14) రనౌట్ అయ్యాడు. రెండో బంతిని సిక్సు కొట్టిన అశ్విన్, మూడో బంతికి రనౌట్ అయ్యాడు. నాల్గో బంతికి పరుగుచేయని పొలార్డు, ఐదో బంతికి ఔటయ్యాడు. చివరి బంతి డాట్ అయింది. దీంతో ముంబై ఇన్నింగ్స్ 181-9 వద్ద ముగిసింది. ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో లక్నోకు 3 వికెట్లు లభించాయి. ఇక మ్యాచ్‌లో 3 కీలక వికెట్లతో ఆవేష్ ముంబై పతనాన్ని శాసించాడు. ఇక రవి బిష్ణోయ్, స్టోయినీస్, చమీర, హోల్డర్ తలో వికెట్ తీశారు. కాగా సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం.
స్కోర్లు
లక్నోసూపర్ జెయింట్స్: 199-4
ముంబై ఇండియన్స్: 181-9


Click it and Unblock the Notifications












