
ఓపెనర్లు శుభారంభం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోసూపర్ జెయింట్స్‌కు ఆ జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి తొలి వికెట్‌కు 52 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఫాబియన్ అలెన్ వేసిన ఆరో ఓవర్లో క్వింటన్ డికాక్(13 బంతుల్లో 24 రన్స్, 4 ఫోర్లు, ఒక సిక్సు) ఎల్బీడబ్ల్యూలో ఔటయ్యాడు. అనంతరం మనీస్ పాండేతో కలిసి కెప్టెన్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మనీష్ పాండే, స్టోయినీస్ ఔట్
రాహుల్, మనీష్ పాండే రెండో వికెట్‌కు 47 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఫాబియన్ అలెన్ వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్లో మనీష్ పాండే (29 బంతుల్లో 38 రన్స్, 6 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 124 పరుగుల వద్ద లక్నోసూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టోయినీస్ ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సు కొట్టాడు. అయితే జట్టు స్కోర్ 155 పరుగుల వద్ద ఉండగా.. ఉనద్కత్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మకు స్టోయినీస్(10) దొరికిపోయాడు.

కేఎల్ రాహుల్ రికార్డు సెంచరీ
అనంతరం దీపక్ హుడాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 9 ఫోర్లు, 5 సిక్సులతో 56 బంతుల్లో సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇది మూడో సెంచరీ. అయితే రాహుల్‌కు ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్. దీంతో 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసిన జయదేవ్ ఉనద్కత్ 4 పరుగులే ఇచ్చే దీపక్ హుడా (15)ను ఔట్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి లక్నోసూపర్ జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 60 బంతుల్లో కేఎల్ రాహుల్ 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు, మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












