For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hardik Pandya: చరిత్ర సృష్టించిన హార్దిక్ - ఐపీఎల్ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా

LSG VS MI: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో తన అదిరే బౌలింగ్ ప్రదర్శనతో అరుదైన ఘనత సాధించాడు. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో 5/36తో లక్నో జట్టుపై విరుచుకుపడ్డాడు. తద్వారా టీ20 క్రికెట్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ ను నమోదు చేశాడు. ఇంకా మరిన్ని ఘనతలు కూడా సాధించాడు.

తొలి కెప్టెన్ గా రికార్డ్..
ఐపీఎల్ లో ఏ కెప్టెన్ సాధించని ఘనత సాధించాడు హార్దిక్ పాండ్య. ఐపీఎల్ చరిత్రలో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి కెప్టెన్ గా నిలిచాడు. ఈ మ్యాచులో హార్దిక్ పాండ్య.. మరక్రమ్ (53), నికోలస్ పూరన్ (12), రిషభ్ పంత్ (2), డేవిడ్ మిల్లర్ (27), ఆకాశ్ దీప్ (0) కీలక వికెట్లను తీశాడు. లేదంటే ఇప్పటికే ఈ మ్యాచులో దూకుడుగా ఆడిన లక్నో జట్టు.. 203 కన్నా మరింత ఎక్కువ స్కోరే సాధించింది.

LSG VS MI IPL 2025 Hardik Pandya becomes first captain to achieve five-wicket haul in IPL history

ఐపీఎల్ కెప్టెన్ల బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇవే.
హార్దిక్ పాండ్య (MI) - నాలుగు ఓవర్లలో 5/36 vs లక్నో (ఏప్రిల్ 4, 2025)

అనిల్ కుంబ్లే (ఆర్సీబీ) - నాలుగు ఓవర్లలో 4/16 vs డెక్కన్ ఛార్జర్స్, జోసన్నాబర్గ్ (మే 24, 2009)

అనిల్ కుంబలే (ఆర్సీబీ) - 3.3 ఓవర్లలో 4/16 vs డెక్కన్ ఛార్జర్స్, ముంబయి(ఏప్రిల్ 24, 2010)

జీన్ పాల్ డిమినీ (డెక్కన్ ఛార్జర్స్) - మూడు ఓవర్లలో 4/17 vs సన్ రైజర్స్, విశాఖపట్నం (ఏప్రిల్ 18, 2015)


ఈ మ్యాచులో మొదటగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(60), మార్క్రమ్‌(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. పూరన్‌ 12, పంత్‌ 2, బదోనీ 30, మిల్లర్‌ 27, సమద్‌ 4, శార్దూల్‌ 5, ఆకాశ్‌దీప్‌ 0, అవేశ్‌ 2 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో పాండ్య పాంచ్ పటాఖా ప్రదర్శన చేశాడు. ఏకంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. విఘ్నేశ్‌, అశ్వనీ, బౌల్ట్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.
Story first published: Friday, April 4, 2025, 22:40 [IST]
Other articles published on Apr 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+