Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ ఇద్దరి బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డా- స్పష్టం చేసిన రోహిత్ శర్మ

చెన్నై: ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌లో మరో కీలక మ్యాచ్. ఎలిమినేటర్ రౌండ్‌లో ఇవ్వాళ లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోన్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు చెన్నై స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడుతుంది. గుజరాత్‌ టైటాన్స్‌తో రెండో క్వాలిఫయర్ ఆడే జట్టు ఏదనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

ఈ ఎలిమినేటర్ రోహిత్ శర్మకు లైఫ్ అండ్ డెత్ గేమ్‌. వరుసగా రెండు సీజన్ల ప్లేఆఫ్స్‌కు దూరమైంది ముంబై ఇండియన్స్. 2021, 2022 సీజన్లల్లో లీగ్ దశలోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో కూడా చివరి నిమిషంలో తన బెర్త్‌ను కన్‌ఫర్మ్ చేసుకోగలిగింది. క్లిష్ట పరిస్థితులను అధిగమించి ప్లేఆఫ్స్‌లోకి చేరిన రోహిత్ సేన- ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది.

rohit sharma

ఇంకొన్ని గంటల్లో ఈ మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మ జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కీలక విషయాలను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ సూపర్ స్టార్ టీమ్‌గా పిలుస్తారని, ఆ స్థాయిలో జట్టును తీసుకుని రావడానికి ఫ్రాంచైజీ ఎంతో కష్టపడిందని పేర్కొన్నాడు. ప్లేయర్లను సూపర్ స్టార్లుగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందని వివరించాడు.

తన కేరీర్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి అత్యుత్తమ స్థానం ఉందని, ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని పేర్కొన్నాడు. తననను ఒక పరిణితి చెందిన క్రికెటర్‌గా మార్చిందని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి సీనియర్లతో పాటు తిలక్ వర్మ, నేహాల్ వధెరా యంగ్ క్రికెటర్లకు ఎంతో అవకాశం కల్పించిందని అన్నాడు.

తిలక్ వర్మ, నేహాల్ వధేరా భవిష్యత్తులో ముంబై ఇండియన్స్, టీమిండియాలో కీలక పాత్ర పోషించబోతున్నారని జోస్యం చెప్పాడు రోహిత్ శర్మ. కేరీర్‌ను నిలబెట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా సూర్యకుమార్ యాదవ్ ఎంతో కష్టపడుతున్నాడని, అతని కష్టానికి తగిన ఫలితం దక్కుతోందని పేర్కొన్నాడు. 2017 ఐపీఎల్ ట్రోఫీని గెలవడం తన కేరీర్‌లో అత్యంత కష్టతరమైన విజయమని వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో 127 పరుగులను కాపాడుకున్నామని గుర్తుచేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో తాను అత్యంత కఠినమైన బౌలర్‌గా డేల్ స్టెయిన్‌‌ అని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడేవాడినని పేర్కొన్నాడు. తాను అభిమానించే బౌలర్ కూడా స్టెయినేనని, ఎప్పుడు ఎలాంటి బంతులను సంధిస్తాడనే విషయాన్ని బ్యాటర్ ఏ మాత్రం అంచనా వేయలేడని అన్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌కు చెందిన సునీల్ నరైన్‌ను అత్యంత కఠినమైన బౌలర్‌గా రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, May 24, 2023, 14:39 [IST]
Other articles published on May 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+