Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రెస్సింగ్ రూమ్‌లో నాతో గొడవకు దిగారు- శ్రేయస్ అయ్యర్

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 98 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానానికి ఎగబాకింది. 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ ముంగిట నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 235 పరుగులు చేసింది.

సునీల్ నరైన్ (81; 39 బంతుల్లో, 6x4, 7x6) విధ్వంసం సృష్టించారు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (32; 14 బంతుల్లో, 5x4, 1x6), రమన్‌దీప్ సింగ్ (25*; 6 బంతుల్లో, 1x4, 3x6), శ్రేయస్ అయ్యర్ (23; 15 బంతుల్లో, 3x4) ఆకట్టుకున్నారు. నవీనుల్ హక్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్ (36; 21 బంతుల్లో, 4x4, 2x6) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీశారు.

LSG vs KKR The last six matches in the dressing room there has been havoc- Shreyas Iyer

అయితే హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న తమ జట్టును ఓ సమస్య వేధిస్తోందని మ్యాచ్ ముగిసిన అనంతరం కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయామని, దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా తనతో గొడవకు దిగుతున్నారని శ్రేయస్ ఫన్నీగా చెప్పాడు. గెలుపులో కీలక పాత్ర పోషించిన తమ ఓపెనర్లను కొనియాడాడు.

''గత ఆరు మ్యాచ్ సందర్భాల్లో డ్రెస్సింగ్ రూమ్‌లో విధ్వంసం జరిగింది. టాస్‌లు వరుసగా ఓడిపోతున్న నేపథ్యంలో మా ఆటగాళ్లంతా నా దగ్గరకు వచ్చి అసలు ఏం జరుగుందని నిలదీశారు. అయితే మేం విజయాలు సాధిస్తున్నాం. అదే ముఖ్యం. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇక్కడ 200 మంచి స్కోరు. మేం కాస్త ఎక్కువ పరుగులే చేశాం''

''మా ఓపెనర్లు నరైన్, సాల్ట్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. అద్భుతంగా ఆడుతున్నారు. కుడి-ఎడమ చేతి వాటం బ్యాటర్ల కాంబినేషన్‌తో వస్తున్నాం. ఇది బౌలర్లకు కాస్త ఇబ్బంది ఉంటుంది. వాళ్లు తమ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఓపెనర్లు వేసిన పునాదితో మేం భారీ స్కోరు సాధించాం. ఇక అన్‌క్యాప‌డ్ ప్లేయర్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయి'' అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.

Story first published: Monday, May 6, 2024, 10:36 [IST]
Other articles published on May 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+