For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రింకూ సింగ్ వీరోచిత పోరాటం.. చివరి ఓవర్లో అద్భుత క్యాచ్ వల్ల ఓడిన కేకేఆర్, ప్లేఆఫ్‌కు లక్నో

LSG Vs KKR : Rinku Singh fought brilliantly but KKR lost by 2 runs

నరాలు బిగపట్టి చూసిన మ్యాచ్ ఇది. అమ్మ బాబోయ్ ఏం టెన్షన్ ఏం టెన్షన్.. కాస్తైతే బుర్ర పేలిపోయేదేమో.. చివరి ఓవర్లో మ్యాచ్ ఇరు జట్ల వైపు విజయం దోబూచులాడింది. రింకూ సింగ్ అరివీర భయంకర పోరాటానికి కోల్ కతా గెలిచేది కానీ ఈవెన్ లూయిస్ పట్టిన అద్వితీయ క్యాచ్ వల్ల మ్యాచ్ కోల్ కతా చేజారింది. చివరి ఓవర్లో 21పరుగులు కావాల్సిన తరుణంలో మార్కస్ స్టోయినిస్ వేసిన బౌలింగ్లో రింకూ సింగ్ తొలి బంతికి ఫోర్ కొట్టాడు, రెండు, మూడు బంతుల్లో సిక్సర్లు బాదాడు. తర్వాత బంతికి 2పరుగులు తీశాడు. దీంతో 2బంతుల్లో 3పరుగులు చేయాల్సిన పరిస్థితి. 5వ బంతికి రింకూ హిట్టింగ్ చేయగా.. హాఫ్ సెడ్లో గాల్లోకి లేచింది. ఇక బౌండరీ వద్ద ఉన్న లూయిస్ పరిగెత్తి వచ్చి ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రింకూసింగ్ పోరాటంతో పాటు కోల్ కతా పోరాటం ముగిసింది. చివరి బంతికి ఉమేష్ యాదవ్ బౌల్డవ్వడంతో కేకేఆర్ 2పరుగుల తేడాతో ఓడింది.

వాటే పోరాటం

వాటే పోరాటం

లక్నో విధించిన 211పరుగుల ఛేదనలో కేకేఆర్ అద్వితీయ పోరాటం కనబరిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50పరుగులు 29బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), నితీష్ రానా (42పరుగులు 22బంతుల్లో 9ఫోర్లు), సామ్ బిల్లింగ్స్ (36పరుగులు 24బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు), చివర్లో రింకూ సింగ్ (40పరుగులు, 15బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), సునీల్ నరైన్ ( 21పరుగులు 7బంతుల్లో 3సిక్సర్లు) వీరోచితంగా పోరాడారు.

శుభారంభం దక్కకున్నా

శుభారంభం దక్కకున్నా

ఛేదనలో కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. మొహ్సిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్లో వెంకటేష్ అయ్యార్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో ఒక్కపరుగు చేయకుండానే కేకేఆర్ ఓ వికెట్ కోల్పోయింది. కీపర్ డికాక్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇక తర్వాత 3వ ఓవర్లో కేకేఆర్‌కు మరో దెబ్బ పడింది. అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న అభిజిత్ తోమర్ (4) క్యాచ్ అవుట్ అయ్యాడు. రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ కేకేఆర్ బ్యాటర్లు నితీష్ రానా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగి ఆడారు. దీంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది.

 బిల్లింగ్స్, నితీష్ రానాతో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన శ్రేయస్

బిల్లింగ్స్, నితీష్ రానాతో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన శ్రేయస్

అవేష్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో నితీష్ రానా 4ఫోర్లు కొట్టి మొత్తం 21పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆ ఓవర్లో 21పరుగులొచ్చాయి. హోల్డర్ వేసిన 5వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ ఫోర్, సిక్స్, ఫోర్ కొట్టి స్కోరు బోర్డు మూమెంటమ్ పెంచేశాడు. గౌతమ్ వేసిన 6వ ఓవర్లోనూ నితీష్ రానా మూడు ఫోర్లు కొట్టి పవర్ ప్లేనే పవర్ ఫుల్‌గా ముగించాడు. దీంతో 6ఓవర్లు పూర్తయ్యేసరికి కోల్ కతా 2వికెట్లు కోల్పోయి 60పరుగులు చేసింది. ఇక వీరిద్దరి జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో గౌతమ్ వీరి పార్ట్ నర్ షిప్‌కు కళ్లెం వేశాడు. వికెట్ పడ్డా కూడా శ్రేయస్ అయ్యార్ మాత్రం తన దూకుడు తగ్గించలేదు. బిల్లింగ్స్‌తో కలిసి టార్గెట్ దిశగా ఇన్నింగ్స్ నడిపించాడు. 10వ ఓవర్లో సామ్ బిల్లింగ్స్ రెచ్చిపోయాడు. ఆవేష్ ఖాన్ వేసిన ఆ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్లో 20పరుగులొచ్చాయి. తర్వాతి బిష్ణోయ్ వేసిన 11ఓవర్లోనూ 16పరుగులొచ్చాయి. 13ఓవర్లు పూర్తయ్యేసరికి 42 బంతుల్లో 84పరుగులు చేయాల్సిన స్థితి నెలకొంది. కానీ 14ఓవర్ 4వ బంతికి హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యార్ హిట్టింగ్ చేయగా.. దాన్ని హుడా అద్భుతంగా అందుకున్నాడు. శ్రేయస్ ఔటవ్వడంతో కోల్ కతా ఇన్నింగ్స్ గాడి తప్పింది.

 రస్సెల్ ఔటవ్వడంతో అయిపోయిందనుకున్నారు

రస్సెల్ ఔటవ్వడంతో అయిపోయిందనుకున్నారు

తర్వాత 16వ ఓవర్లో సామ్ బిల్లింగ్స్ ఔట్ కావడం, 17వ ఓవర్లో మొహ్సిన్ ఖాన్ బౌలింగ్లో రస్సెల్ (5పరుగులు 11బంతుల్లో) బౌండరీ వద్ద క్యాచ్ ఔట్ కావడంతో కేకేఆర్ ఓటమి ఖాయమైందనుకున్న దశలో.. సునీల్ నరైన్, రింకూసింగ్ వీరోచితంగా పోరాడారు. వీరిద్దరు సిక్సర్లు, ఫోర్లతో లక్నో బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. 18బంతుల్లో 55పరుగులు చేయాల్సిన తరుణంలో 18వ ఓవర్ అవేష్ ఖాన్ వేసిన బౌలింగ్లో రింకూ ఒక సిక్సర్, నరైన్ ఒక సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్లో 17పరుగులొచ్చాయి. ఇక తర్వాత హోల్డర్ బౌలింగ్లోనూ రింకూ, నరైన్ చెరో సిక్సర్ కొట్టడంతో ఆ ఓవర్లోనూ 17పరుగులొచ్చాయి.

చివరి ఓవర్లో ఆ క్యాచ్ వల్ల

చివరి ఓవర్లో ఆ క్యాచ్ వల్ల

దీంతో చివరి ఓవర్లో 21పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ టైంలో రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో వరుసగా 4, 6, 6, బాదాడు. దీంతో 3బంతుల్లో 5పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో రింకూ రెండు రన్స్ తీశాడు. తర్వాత బంతికి ఈవెన్ లూయిస్ ఒక్క చేతితో పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చింది. రింకూ ఔటయిపోగా చివరకు ఉమేష్ యాదవ్ క్రీజులోకి రాగా స్టోయినిస్ అతన్ని బౌల్డ్ చేశాడు. దీంతో రెండు పరుగుల తేడాతో కోల్‌కతా ఓటమిపాలయింది. దీంతో కేకేఆర్ ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోగా.. లక్నో 18పాయింట్లతో ప్లేఆఫ్ రేసుకు చేరుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే లక్నో టాప్ 2పొజిషన్లోకి వెళ్లే వీలుంది.

Story first published: Wednesday, May 18, 2022, 23:45 [IST]
Other articles published on May 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+