For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మేం ఛేజింగ్ చేయలేం నాయనా.. అందుకే బ్యాటింగ్ తీసుకుంటామన్న లక్నో కెప్టెన్.. టాస్, జట్ల వివరాలివే?

 LSG Vs KKR : Lucknow Super Giants have won the toss and have opted to bat

ఐపీఎల్‌ 2022 సీజన్‌‌‌ లీగ్ దశ దాదాపు ముగింపుకు చేరుకుంది. నేటి నుంచి ప్రతి జట్టు తన చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో నేడు ప్లేఆఫ్ రేసులో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. లక్నో గెలిస్తే మిగతా జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది. అలాగే టాప్ 2 పొజిషన్‌కు కూడా చేరుకునే వీలుంటుంది. ఇక కోల్‌కతా గెలిచినా ఆ జట్టు ప్లేఆఫ్ చేరాలంటే.. రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌లలో ఓడాలి. అలాగే కేకేఆర్ నేటి మ్యాచ్‌లో అందుకు తగ్గ రన్ రేట్ పెంచుకునేలా లక్నోపై గెలవాలి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ 6వస్థానంలో ఉండగా.. లక్నో 2వ స్థానంలో ఉంది.

టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే

టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే

ఈ క్రమంలో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ టాస్ కోసం గ్రౌండ్లోకి రాగా.. టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ మొదట బ్యాటింగ్ చేస్తామని తెలిపాడు. దీంతో తొలుత లక్నో బ్యాటింగ్‌కు దిగనుండగా.. లక్నో బ్యాటర్లను కట్టడి చేసే రోల్‌లో కేకేఆర్ ప్లేయర్లు కన్పించనున్నారు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. మేము తొలుత బ్యాటింగ్ చేయడానికి కారణం పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోంది. గత కొన్ని గేమ్‌లలో ఛేజింగ్ చేయడం చాలా కష్టమైంది. అందుకే బ్యాటింగ్ ముందు ఎంచుకున్నాం. మేము కాస్త పాజిటివ్‌గా ఉండాలి. మేము టోర్నమెంట్‌లో ఆసాంతం చాలా బాగా రాణించాం. కానీ కొన్ని మ్యాచ్‌లలో నిరాశపరిచాం. ఈ గేమ్‌ని గెలవడానికి ప్రయత్నించాలి. మేము మా శక్తినంతా గేమ్‌పై కేంద్రీకరిస్తాం. మేము మిడిల్ ఆర్డర్‌లో నాణ్యతను కలిగి ఉన్నాం. మా జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. కృనాల్ పాండ్యా, చమీర, బదోనీ స్థానంలో మాకు మనన్ వోహ్రా, లూయిస్, గౌతమ్ జట్టులోకి వచ్చారు.

 చివరి ప్రయత్నంగా ఏదైనా చేయాలి

చివరి ప్రయత్నంగా ఏదైనా చేయాలి

టాస్ ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. నేను కూడా బ్యాటింగ్ ఎంచుకుని ఉండేవాడిని. మేం రాణించడానికి, ఏదైనా చేయడానికి ఇది మాకున్న ఏకైక చివరి అవకాశం. కోచ్‌లు, మేనేజ్‌మెంట్, అభిమానుల కోసం మేం రాణించి చూపించాలి. మా జట్టులో రహానే స్థానంలో అభిజీత్ తోమర్ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు:

తుది జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అభిజీత్ తోమర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చకరవర్తి

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

 ఇరు జట్ల తరఫున డెబ్యూ ప్లేయర్లు

ఇరు జట్ల తరఫున డెబ్యూ ప్లేయర్లు

కేకేఆర్ టీం ఓపెనర్ అజింక్యా రహానే గాయపడడంతో అతని స్థానంలో కేకేఆర్ అభిజీత్ తోమర్‌ను ఆడించనుంది. అభిజిత్ తోమర్‌కు ఇది ఐపీఎల్లో తొలి మ్యాచ్‌. కాగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మనన్ వోహ్రా తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇక ఈ సీజన్‌లో ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇది 20వ మ్యాచ్. ఇదే చివరి మ్యాచ్ కూడా. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో 6000కు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు వచ్చాయి. గ్రౌండ్ స్టాఫ్ అద్భుతమైన వికెట్‌ను, అవుట్‌ఫీల్డ్‌ను అందించారు.

Story first published: Wednesday, May 18, 2022, 19:29 [IST]
Other articles published on May 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+