For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని వల్లే ఘోర పరాజయం- కేఎల్ రాహుల్

సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 98 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో నెట్‌రన్‌రేటును భారీగా తగ్గించుకుని ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్టిష్టం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 235 పరుగులు చేసింది.

సునీల్ నరైన్ (81; 39 బంతుల్లో, 6x4, 7x6) విధ్వంసం సృష్టించారు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (32; 14 బంతుల్లో, 5x4, 1x6), రమన్‌దీప్ సింగ్ (25*; 6 బంతుల్లో, 1x4, 3x6), శ్రేయస్ అయ్యర్ (23; 15 బంతుల్లో, 3x4) ఆకట్టుకున్నారు. నవీనుల్ హక్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్ (36; 21 బంతుల్లో, 4x4, 2x6) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీశారు.

LSG vs KKR It s a poor performance with both bat and ball- KL Rahul

కాగా, మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. అన్ని విభాగాల్లో పేలవమైన ప్రదర్శన, సునీల్ నరైన్ విధ్వంసం తమ ఘోర పరాజయానికి కారణమని తెలిపాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో సత్తాచాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ''భారీగా పరుగులు సమర్పించుకున్నాం. ఓవరాల్‌గా బంతి, బ్యాటుతో చెత్త ప్రదర్శన చేశాం. పవర్‌ప్లేలో నరైన్ మాపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు. మా బౌలర్లు ఆ ఒత్తిడిని జయించలేకపోయారు. ఐపీఎల్ అంటే ఇలానే ఉంటుంది. మంచి ఆటగాళ్లను ఎదుర్కొంటూ మనల్ని మనం పరీక్షించుకోవాలి''

''పిచ్ బాగుంది. హార్డ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేస్తే కాస్త బౌన్స్ అవుతుంది. ఇక్కడ వికెట్‌తో పోలిస్తే 235 స్కోరు అంటే 20-30 పరుగులు అధికమే. మా బ్యాటింగ్ పేలవంగా ఉంది. అయితే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడిచేయడానికి మేం ముందుగానే సన్నద్ధమయ్యాం. కానీ మా ప్రణాళికలు ఫలించలేదు. సునీల్ నరైన్, ఇతర బ్యాటర్ల వద్ద కొన్ని పొరపాట్లు చేశాం''

''డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత మా ప్రదర్శనను పరిశీలించుకుంటాం. ఎక్కడ తప్పు చేశామో తెలుసుకుంటాం. ఈ సీజన్‌లో సొంతమైదానంలో మా చివరి మ్యాచ్ ముగిసింది. వచ్చే మ్యాచ్‌ల్లో మేం మరింత బెదురులేని క్రికెట్ ఆడాల్సి ఉంది'' అని రాహుల్ తెలిపాడు.

Story first published: Monday, May 6, 2024, 8:08 [IST]
Other articles published on May 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+