Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs GT: శార్దూల్ ఠాకూర్ డబుల్ సెంచరీ

LSG vs GT: ఐపీఎల్ 2025 వేలంలో శార్దూల్ ఠాకూర్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదనే విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయపడటంతో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నోసూపర్ జెయింట్స్ శార్దూల్ కు అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా వినియోగించుకుంటున్నాడు. శార్దూల్ వచ్చిన వెంటనే మొదటి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ నిలకడగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

రెండు బంతుల్లో ఇద్దరు విస్పోటక బ్యాటర్లు ఔట్
శుభ్ మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేశాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ మొదటి బంతికే సిక్స్ కొట్టాడు. కానీ తర్వాత 5 బంతుల్లో శార్దూల్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. చివరి ఓవర్ 3,4 బంతులకు వరుసగా రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా వికెట్లను తీశాడు. చివరి ఓవర్ మూడో బంతికి షర్పాన్ రూథర్‌ఫోర్డ్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. అతని తర్వాత క్రీజులోకి వచ్చి రాహుల్ తెవాటియాను మొదటి బంతికే ఔట్ చేశాడు.

LSG vs GT Shardul Thakur Completed Double Century Wickets in T20 History

టీ20ల్లో శార్జూల్ 200 వికెట్లు
ఈ మ్యాచ్ లో శార్దూల్ హ్యాట్రిక్ తీయలేకపోయాడు. రాహుల్ తెవాటియా వికెట్ తో శార్దూల్ ఈ ఫార్మాట్ లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో 200 వికెట్లు తీసిన 10వ భారత ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. టీ20 ల్లో 200 వికెట్లు తీసిన 18వ భారత బౌలర్ గా.. ఓవరాల్‌గా 103వ బౌలర్ గా శార్దూల్ రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్ లో భారత ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ ఖాతాలో 315 వికెట్లు ఉన్నాయి. టీ20ల్లో 300 వికెట్లు తీసిన ఏకైక భారత పేసర్ భువీ. బుమ్రా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం మీద భారత బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ 365 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ ఖాన్ 467 మ్యాచ్ ల్లో 637 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, April 12, 2025, 19:52 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+