LSG vs GT: కట్టుదిట్టంగా లక్నో బౌలింగ్.. హిట్టింగ్‌లో తడబడి లోస్కోరుకే గుజరాత్ పరిమితం

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మంగళవారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 20ఓవర్లు ముగిసేసరికి జీటీ 4వికెట్లు కోల్పోయి 144పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (63పరుగులు 49బంతుల్లో 7ఫోర్లు నాటౌట్) కడదాకా నిలబడి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు రెగ్యులర్‌గా బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నా పట్టుదలగా క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అలాగే చివర్లో రాహుల్ తెవాతీయ (23పరుగులు 16బంతుల్లో 4ఫోర్లు నాటౌట్) రాణించడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఇక లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్లు పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. గుజరాత్ బౌలర్లలో మోహ్సిన్ ఖాన్ (4-0-18-1) ఒక వికెట్ ప్రదర్శనతో ఆకట్టుకోగా.. ఆవేశ్ ఖాన్ 4ఓవర్లలో 26పరుగులిచ్చి 2వికెట్లు తీశాడు. ఇక జాసన్ హోల్డర్ 1వికెట్ తీసి 41పరుగులు ఇచ్చాడు.

దక్కని శుభారంభం
గుజరాత్ బ్యాటర్లకు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. మొహ్సిన్ ఖాన్ వేసిన 3ఓవర్లో సాహా (5పరుగులు 11బంతుల్లో) క్యాచ్ ఔట్ అవడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. ఇక అనంతరం బరిలోకి దిగిన మాథ్యువేడ్ వచ్చీరాగానే చమీరా వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 2ఫోర్లు బాది టచ్‌లో కన్పించాడు. కానీ వేడ్ (10) ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

నిరాశపరిచిన హార్దిక్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న గిల్
ఇక 24పరుగులకే 2వికెట్లు కోల్పోయిన జట్టును గట్టెక్కించేందుకు బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా 1 పరుగు వద్ద రనౌట్‌ను తప్పించుకున్నాడు. లడ్డూ లాంటి రనౌట్‌ను చెత్త త్రోతో బదోని మిస్ చేశాడు. వచ్చిన అవకాశాన్ని హార్దిక్ (11పరుగులు 13బంతుల్లో) సద్వినియోగం చేసుకోలేదు. 10ఓవర్లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ (26పరుగులు 24బంతుల్లో) జాసన్ హోల్డర్ వేసి 16ఓవర్లో సిక్సు కొట్టి టచ్ లోకి వచ్చాడనుకున్న తరుణంలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్ మూమెంటమ్ బాగా దెబ్బతింది.

పట్టు బిగించిన లక్నో బౌలర్లు
మరోవైపు లక్నో బౌలర్లు తమ పట్టు బిగించారు. పరుగులు రావడం కష్టమైంది. ఇక ఈ క్రమంలో 17ఓవర్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న గిల్ తర్వాత కొన్ని బౌండరీలతో స్కోరు బోర్డుకు కాస్త మూమెంటమ్ తెచ్చాడు. అయినప్పటికీ చివర్లో దుష్మంత్ చమీరా, మొహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ తమ కట్టుదిట్టమైన బంతులతో స్కోరు బోర్డును కంట్రోల్‌లో ఉంచారు. ఇక ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో రాహుల్ తెవాతీయా ఇచ్చిన క్యాచ్‌ను దీపక్ హుడా మిస్ చేయడం గుజరాత్ కు కాస్త ఊరటనిచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న తెవాతీయా చివరి ఓవర్లో 13పరుగులు పిండుకోగా ఆ ఓవర్లో మొత్తం 16పరుగులొచ్చాయి. స్కోరు 144కాగా.. లక్నో ముందు 145పరుగుల టార్గెట్ ఏర్పడింది.

తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కరణ్ శర్మ, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications