IPL 2022: అన్న బౌలింగ్‌లో తమ్ముడు హార్దిక్ ఔట్.. సంబరాలు చేసుకోని కృనాల్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2022లో సోమవారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోని ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో అన్నదమ్ములైన కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ క్రమంలో తమ్ముడు హార్దిక్ పాండ్యాను అన్న కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. అయితే ఆ సమయంలో కృనాల్ పాండ్యా ఎలాంటి సంబరాలు చేసుకోకపోవడం ఆసక్తిరకంగా మారింది.

తొలి సారి ప్రత్యర్థులుగా
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అందరి చూపు అన్నదమ్ముళ్లైన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాపైనే పడింది. ఎందుకంటే సోదరులైన వీరిద్దరు తొలి సారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కృనాల్ పాండ్యా కీలక ఆటగాడిగా ఉన్నాడు.
వీరిద్దరు గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. కానీ ఈ సారి వీరిద్దరిని ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలో కృనాల్ పాండ్యాను లక్నో సూపర్ జెయింట్స్ 8 కోట్ల 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక హార్దిక్ పాండ్యాను మెగా వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ 15 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది.

అన్నకు బౌలింగ్ చేయని తమ్ముడు
ఈ మ్యాచ్‌లో మొదట లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేయగా తమ్ముడు హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను అన్న కృనాల్ పాండ్యా ఎలా ఎదుర్కొంటాడో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ కృనాల్ పాండ్యా 16వ ఓవర్లో బ్యాటింగ్‌కు రావడంతో అప్పటికే హార్దిక్ పాండ్యా బౌలింగ్ కోటా ముగిసింది. దీంతో కృనాల్‌కు హార్దిక్ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక బ్యాటింగ్‌లో 13 బంతులు ఎదుర్కొన్న కృనాల్ పాండ్యా 21 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.
హార్దిక్ - కృనాల్ పోరు
అయితే గుజరాత్ బ్యాటింగ్ సమయంలో హార్దిక్ పాండ్యాకు కృనాల్ పాండ్యా బౌలింగ్ చేశాడు. 15-2తో గుజరాత్ కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ జట్టును ఆదుకున్నాడు. ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీ బాదాడు. ఈ క్రమంలో లక్నో కెప్టెన్ రాహుల్.. కృనాల్‌కు బౌలింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ పోరును అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు.
సంబరాలు చేసుకుని కృనాల్
అయితే కృనాల్ పాండ్యా వేసిన మొదటి రెండు ఓవర్లను బాగానే ఎదుర్కొన్న హార్దిక్ అతను వేసిన మూడో ఓవర్ తొలి బంతికి మాత్రం ఔటయ్యాడు. ఆ బంతిని భారీ షాట్ బాదిన హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండేకు దొరికిపోయాడు. దీంతో 33 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ముగిసింది. అయితే సాధారణంగా బ్యాటర్‌ను ఔట్ చేసినప్పుడు బౌలర్ సంబరాలు చేసుకుంటాడు. కానీ తమ్ముడిని ఔట్ చేశాననే చిన్న అసంతృప్తితో కృనాల్ పాండ్యా సంబరాలు చేసుకోలేకపోయాడు.
ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తాను ఆడుతున్న జట్టుకు వికెట్ తీసి సహకరించానని సంబరాలు చేసుకోవాలో, తమ్ముడిని ఔట్ చేశానని బాధపడాలో అర్థం కాని సందింగ్ధంలో కృనాల్ పాండ్యా ఉండి పోయాడు. ఆ తర్వాత తేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సమయంలో మైదానంలోనే ఉన్న హార్దిక్ పాండ్యా భార్య కూడా ఇలాగే సందిగ్ధంలో ఉండిపోయింది. కాగా ఈ మ్యాచ్‌లో 17 పరుగులే ఇచ్చిన కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు.

గుజరాత్ విజయం
ఇక ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 6 వికెట్ట నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని గుజరాత్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications