LSG vs GT: ఇండియన్ ప్రీమియర్ 2025లో భాగంగా శుభమన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లక్నో జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇప్పుటికే ప్లేఆఫ్స్ చేరుకున్న గుజరాత్ జట్టు ఈ నామమాత్రపు మ్యాచ్ లో కాన్సర్ అవగాహన కార్యక్రమానికి మద్దతుగా లావెండర్ జెర్సీతో బరిలోకి దిగింది.
ఇప్పటివరకు ఈ సీజన్‌లో 12 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు లక్నో కూడా ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్లపట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికే లక్నో ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. లక్నో సూపర్ జెయింట్స్ తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాచ్ గెలవాలని కోరుకుంటుంది. అయితే గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.

తుది జట్లు ఇవే..
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వాక్/సి), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఓ రూర్కే.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవి శ్రీనివాసన్, సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.